OG Firestorm Song Abroad: రీసెంట్ గా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) నుండి మేకర్స్ ‘ఫైర్ స్ట్రోమ్'(#FireStorm) అనే పాటని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏ శుభముహుర్తం లో ఈ పాట ని విడుదల చేశారో తెలియదు కానీ, ఇప్పుడు ఈ పాట ప్రపంచంలో ఉన్న మూవీ లవర్స్ మొత్తాన్ని ఊపేస్తోంది. మొదటిసారి విన్నప్పుడే అత్యధిక శాతం మందికి నచ్చింది కానీ, కొంతమంది మాత్రం లిరిక్స్ అసలు ఒక్క ముక్క అర్థం కావడం లేదు, స్వరం కంటే ఎక్కువ మ్యూజిక్ వినిపిస్తుంది, అది స్వరాన్ని డామినేట్ చేస్తుంది అని చెప్పుకొచ్చారు. కానీ అలా కామెంట్ చేసిన వారే ఇప్పుడు ఈ పాట అద్భుతం అంటూ సోషల్ మీడియా లో ట్వీట్లు వేస్తున్నారు. నిజంగా ఇది థమన్ నుండి మెంటల్ ఎక్కిపోయే రేంజ్ స్టఫ్ అని చెప్పొచ్చు. ఈ పాట ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఆన్లైన్ అన్ని మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ లో టాప్ 1 స్థానం లో ట్రెండ్ అవుతూ ఉంది.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన పాట ఇంతటి సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకోలేదు. ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ మరియు ‘లా లా భీమ్లా’ పాటల తర్వాత ఆయన నుండి విడుదలైన చిత్రాల్లో ‘ఓజీ’ పాటకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అమెరికా, న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్, దుబాయి, సింగపూర్, కెనడా ఇలా అన్ని దేశాల్లోనూ ఈ పాట ఆన్లైన్ లో వీర విహారం చేస్తుంది. రీసెంట్ గానే నార్త్ అమెరికా లోని న్యూ జెర్సీ లో ఒక ప్రైవేట్ పార్టీ లో అమ్మాయిలు ఈ పాటకు డ్యాన్స్ వేస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది కదా పవన్ కళ్యాణ్ సినిమాకు ఉండాల్సిన అసలు సిసలు మేనియా అంటే అంటూ అభిమానులు ఈ సాంగ్ సృష్టించిన ప్రభంజనం చూస్ మురిసిపోయారు.
ఒకే ఒక్క నిరాశకు గురి చేసే విషయం ఏమిటంటే ఈ పాట ని హిందీ మరియు తమిళ వెర్షన్స్ లో ఇంకా విడుదల చేయకపోవడమే. తెలుగు వెర్షన్ పాట కి హిందీ మరియు తమిళ ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళు హిందీ, తమిళ వెర్షన్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ నుండి మాత్రం ఇంకా రెస్పాన్స్ రాలేదు. అభిమానులు కూడా మేకర్స్ ని ట్యాగ్ చేసి ఈ విషయం గురించి అడుగుతున్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం లోనే రెండు వెర్షన్స్ కి సంబందించిన పాట విడుదల అవుతుందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి మరి.
#TheyCallHimOG Craze In NYC pic.twitter.com/cWWobXjiYj
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) August 5, 2025