Supreme Court: దేశంలో ఘనంగా నిర్వహించుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి. దేశవ్యాప్తంగా వినాయక చవితిని ప్రతి ఏటా చేసుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో వినాయక చవితి ప్రారంభం రోజునే రాష్ర్ట హైకోర్టు వినాయక నిమజ్జనంపై సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం హైకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేసింది. అయినా కోర్టు తన తీర్పునే సమర్థించింది. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ససేమిరా అంది. దీంతో ప్రభుత్వంలో కూడా ఆందోళన పెరిగింది. దీంతో వివిధ సంఘాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలో వినాయకుడి ప్రతిమలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఏం ఉన్నాయనే దానిపై తర్జనభర్జన కొనసాగింది. దీంతో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టులో జీహెచ్ఎంసీ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపింది. ప్రభుత్వం వాదనను విని తదనుగుణంగా తీర్పు ఇవ్వాలని భావించింది.
హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ అది ఈ సంవత్సరానికి మాత్రమే. వచ్చే సంవత్సరం నుంచి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి వీలు లేదని చెప్పింది. వచ్చే ఏడాది ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వానికి ఊరట లభించినా వచ్చే సంవత్సరం గురించి ఆందోళన మొదలైంది. పీవోపీ విగ్రహాలతో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
నాలుగు రోజుల్లో నిమజ్జనం ఉండడంతో హైదరాబాద్ లో మార్గం సుగమం కానుంది. సుప్రీంకోర్టు నేపథ్యంలో పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ఓకే చెప్పడంతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కోర్టు తీర్పుతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. భక్తులు ఈసారి నిమజ్జనానికి రూట్ క్లియర్ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ వచ్చే ఏడాది మాత్రం దుర్భర పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదైనా నిమజ్జనం ఓ సమస్యగానే మారనుంది.