https://oktelugu.com/

TRS vs BJP : టీఆర్ఎస్, బీజేపీ కేసుల హోరు.. సుప్రీంకోర్టే బేజారు

TRS vs BJP : కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ తలపడుతోంది. ఈ క్రమంలోనే పరస్పర కేసులతో ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భావిస్తున్న బీజేపీ.. కేసీఆర్ ఆయువుపట్టుపై మొదట కొట్టింది. కవితను లిక్కర్ స్కాంలో చూపించి కేసీఆర్ ను అభాసుపాలు చేసింది. దీంతో రగిలిపోయిన కేసీఆర్ తన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దొరికిన ముగ్గురు నిందితులను దొరకబట్టి బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా కీలక […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2022 / 08:00 PM IST
    Follow us on

    TRS vs BJP : కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో రాష్ట్రంలోని కేసీఆర్ సర్కార్ తలపడుతోంది. ఈ క్రమంలోనే పరస్పర కేసులతో ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భావిస్తున్న బీజేపీ.. కేసీఆర్ ఆయువుపట్టుపై మొదట కొట్టింది. కవితను లిక్కర్ స్కాంలో చూపించి కేసీఆర్ ను అభాసుపాలు చేసింది. దీంతో రగిలిపోయిన కేసీఆర్ తన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దొరికిన ముగ్గురు నిందితులను దొరకబట్టి బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా కీలక వ్యక్తులను బోనులో నిలబెట్టాలని పెద్ద స్కెచ్ వేశాడు. ఇక ఈ కేసులో అమిత్ షా సహా మోడీ పేర్లు వచ్చేలా ప్లాన్ చేశాడు.

     

     

    ఇప్పుడీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. మొదట ఏసీబీ కోర్టు నిందితులకు బెయిల్ ఇవ్వడం.. హైకోర్టు నిరాకరించడం.. నిందితులు సుప్రీంకోర్టు గడపతొక్కడం జరిగిపోయింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులోనూ నిందితులకు చుక్కెదురైంది. ఇక ఈ నిందితుల తరుఫున బీజేపీ రంగంలోకి దిగి పిటీషన్ వేయడంతో ఇదొక రాజకీయ రంగు పులుముకుంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీలా మారింది.

    సుప్రీంకోర్టు తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన వ్యాఖ్యలు చేసింది. బెయిల్ విషయంలో హైకోర్టు చర్యలను తప్పుపట్టినట్టు పరోక్షంగా చెప్పుకొచ్చింది. నిందితులకు బెయిల్ నిరాకరించి షాకిచ్చిన సుప్రీంకోర్టు.. విచారణలో జోక్యం చేసుకోలేమని బీజేపీకి , నిందితులకు షాకిచ్చింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అయితే బెయిల్ నిరాకరణకు హైకోర్టు చూపిన కారణాలు సంతృప్తికరంగా లేవని సుప్రీంకోర్టు జడ్జీలు డౌట్ వ్యక్తం చేయడం గమనార్హం.

    ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీని ఇరికించాలని టీఆర్ఎస్.. టీఆర్ఎస్ వాదనను ఒట్టి కట్టుకథగా చూపించాలని బీజేపీ హైలెవల్ లో ప్రయత్నిస్తున్నాయని అర్థమవుతున్నాయి. దీనికి కోర్టులనే వేదికగా చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎవరి లెవల్ లో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఈ కేసుపై భిన్నమైన అభిప్రాయలు రావడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ పంతంలో ఎవరి వాదన నెగ్గుతుంది? ఎవరికి మొగ్గు లభిస్తుందన్నది వేచిచూడాలి.