Bigg Boss 6 Telugu : రేవంత్ కెప్టెన్ అయితే కంటెస్టెంట్స్ కి చుక్కలే. ముఖ్యంగా ఫుడ్ విషయంలో లేనిపోని రిస్ట్రిక్షన్స్ తో అల్లాడిస్తాడు. ఈ వారం కెప్టెన్ గా రేవంత్ రెండోసారి బాధ్యతలు తీసుకున్నాడు. గత వారం కెప్టెన్ గా ఉన్న ఫైమా… ఐదు కప్పులు కూడా సరిపోవడం లేదు, నాలుగు కప్పులు అసలు సరిపోదని ఫైమా చెప్పింది. దానికి రేవంత్ సరిపోతుందా లేదా అన్నది కాదు. పంపిన రేషన్ బట్టి ఫుడ్ ప్రిపేర్ చేస్తాం అన్నాడు. ఉన్న రేషన్ మాత్రమే వాడాలని లేదు, ఐపోతే మరలా పంపిస్తారని ఫైమా సమాధానం చెప్పింది. వాళ్ళు పంపిస్తారని రేషన్ నేను వాడను అని రేవంత్ సమాధానం చెప్పింది.

ఫుడ్ దగ్గర పరిమితులు ఏంటి? ప్రతి విషయంలో తన మాటే నెగ్గాలని అనుకుంటాడంటూ ఇనయా అసహనం వ్యక్తం చేసింది. వారం మొత్తం సేవ్ చేసి చివర్లో అధికంగా ఇచ్చినా వాళ్లకు గుర్తు ఉండదు. నువ్వు కెప్టెన్ గా పేరు తెచ్చుకోవడానికి కంటెస్టెంట్స్ కడుపులు మాడ్చడం సరికాదని శ్రీహాన్ రేవంత్ ని ప్రశ్నించాడు. మాములుగా రేవంత్ హౌస్ ని కంట్రోల్ చేయాలి, అందరూ తన మాట వినాలి అనుకుంటాడు. కెప్టెన్ అయితే నిరంకుశత్వం ఏమిటో పరిచయం చేస్తాడు.
రేవంత్ ఏం చేసినా బిగ్ బాస్ కానీ, హోస్ట్ నాగార్జున కానీ ఏమీ అనరు. అందుకే హౌస్లో రేవంత్ ఆటలు సాగుతున్నాయనే వాదన ఉంది. ఇక విన్నర్ గా రేవంత్ ని డిసైడ్ చేసిన మేకర్స్… అతన్ని ఎత్తే కార్యక్రమం పెట్టుకున్నారనే వాదనలు విపిస్తున్నాయి. ఇక నేడు సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ జరగనుంది. కంటెస్టెంట్స్ కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి ఇద్దరిద్దరిని నామినేట్ చేయాల్సి ఉంది. కారణాలు చెప్పి నామినేట్ చేయడంతో పాటు వాళ్ళ ఫోటోలు ముక్కలుగా చేయాల్సి ఉంటుంది.
నామినేషన్స్ లో ఎవరు ఉన్నారనే విషయం లీకైంది. దానికి సంబంధించిన లిస్ట్ చక్కర్లు కొడుతుంది. రేవంత్ కెప్టెన్ కావడంతో అతడు ఒక్కడే నామినేషన్స్ నుండి మినహాయింపు పొందారట. మిగిలిన 8 మంది సభ్యులు నామినేట్ అయ్యారట. కాగా ఈ వారం మెరీనా ఎలిమినేట్ అయ్యారు. రోహిత్-మెరీనా జంటగా ఆడేందుకు హౌస్లోకి వచ్చారు. అయితే బిగ్ బాస్ వాళ్ళను వేరు వేరుగా ఆడాలని ఆదేశించాడు. దీంతో 11వ వారం మెరీనా ఎలిమినేటై వెళ్ళిపోయింది.
