ప్రభుత్వాలకు 15రోజులే గడువిచ్చిన సుప్రీం!

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 15 రోజుల గడువు ఇచ్చింది. వలస కూలీలను తరలించేందుకు ఆ సమయం సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై తుది తీర్పును జూన్ 9వ తేదీన ఇస్తామని ప్రకటించింది. వలస కూలీల బాధలకు సంబంధించి దాఖలైన ఓ పిల్ మీద సుమోటోగా విచారణ జరుపుతున్న త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు […]

Written By: Neelambaram, Updated On : June 5, 2020 6:04 pm
Follow us on

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 15 రోజుల గడువు ఇచ్చింది. వలస కూలీలను తరలించేందుకు ఆ సమయం సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ అంశంపై తుది తీర్పును జూన్ 9వ తేదీన ఇస్తామని ప్రకటించింది. వలస కూలీల బాధలకు సంబంధించి దాఖలైన ఓ పిల్ మీద సుమోటోగా విచారణ జరుపుతున్న త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

వలస కూలీలను 15 రోజుల్లో సొంతూరుకు చేర్చాలి. వలస కూలీలకు ఉపాధి ఎలా చూపిస్తారో కూడా అన్ని రాష్ట్రాలు స్పష్టంగా చెప్పాలి. వలస కూలీల ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్లు చేయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు సుమారు కోటి మందిని గమ్యస్థానాలకు చేర్చినట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. రైళ్లలో 57 లక్షల మందిని, బస్సుల్లో 41 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్టె కోర్టుకు తెలిపారు. ఢిల్లీలో సుమారు 2 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని, వారు తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి సిద్ధపడడం లేదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ చెప్పారు. కేవలం 10,000 మంది మాత్రమే సొంతూళ్లకు వెళ్లడానికి సుముఖంగా ఉన్నారన్నారు. యూపీ ప్రభుత్వం కూడా దాదాపు అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారు.