Bhatti Vikramarka : ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు బయటకు వెళితే మాడిపోతాం.. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడి భగభగలు చోటుచేసుకుంటున్నాయి. జనాలు అంతా కూలర్లు, ఏసీల కింద తలదాచుకుంటున్నారు. తప్పనిసరి అయితే తప్పా బయటకు వెళ్లడం లేదు.
ఇంతటి ఎండల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారు. అదే ఇప్పుడు ఆయనకు శరాఘాతంగా మారింది. ఎండదెబ్బ తగిలేలా చేసింది.. భట్టి విక్రమార్కకు వడదెబ్బ కారణంగా ఇంకా తగ్గని జ్వరము, నీరసం. రెండో రోజు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద ట్రీట్మెంట్ కొనసాగుతోంది.డిహైడ్రేషన్ కావడంతో సెలైన్స్ పెట్టిన వైద్యులు ప్రస్తుతం పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.
-భట్టికి కేఎల్ ఆర్ పరామర్శ
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురవడంతో రెండో రోజు బుధవారం నాడు సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్యలు చికిత్స అందిస్తున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన మల్లు భట్టివిక్రమార్కని సూర్యాపేట జిల్లా కేతేపల్లి గ్రామ పాదయాత్ర శిబిరం వద్ద
సీనియర్ కాంగ్రెస్ నేతలు కేఎల్‌ఆర్,ప్రేమ్ సాగర్ రావు పరామర్శించారు.