Homeజాతీయ వార్తలుSudden Rainfall Heatwave: ఉన్నట్టుండి ఆకాశంలో మబ్బులు.. అఖండమైన వాన.. వడగండ్లు.. ఎందుకిలా

Sudden Rainfall Heatwave: ఉన్నట్టుండి ఆకాశంలో మబ్బులు.. అఖండమైన వాన.. వడగండ్లు.. ఎందుకిలా

Sudden Rainfall Heatwave: రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఇటువంటి స్థితిలో వర్షం పడితే ఎలా ఉంటుంది.. అదేంటి మండే ఎండల్లో వర్షం కురవడం ఏంటి అనే అనుమానం మీలో కలుగుతుంది కదా.. కానీ ప్రకృతి రాసిన స్క్రిప్ట్ మరో విధంగా ఉంది. అందువల్లే ఎండాకాలం మరో వానకాలంలాగా మారిపోయింది.

ఇటీవల హైదరాబాదులో విపరీతమైన వర్షం కురిసింది. ఆ వర్షానికి తగ్గట్టుగా వడగండ్లు కూడా పడ్డాయి. ఆ వడగండ్ల దెబ్బకు హైదరాబాదు నగరం మొత్తం హిమాలయ పర్వతాల మాదిరిగా మారిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డు మీద దాదాపు అరఫీట్ మందం మంచు గడ్డలు పేరుకుపోయాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు సంచలనం సృష్టించాయి. హైదరాబాద్ మొత్తం హిమనగరిగా మారిపోయిందని చాలామంది అభిప్రాయపడ్డారు.. ఎండాకాలంలో వాన కాలం లాగా ఉందని సంతోషపడ్డారు. హైదరాబాదులో కురిసిన వర్షం ఎండ వేడిమి నుంచి ప్రజలకు సాంత్వన కలిగించింది.

మహారాష్ట్రలో కూడా ఆదే స్థాయిలో వడగండ్లు కురవడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. దీంతో ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించింది. హైదరాబాద్, మహారాష్ట్రను మర్చిపోకముందే.. బెంగళూరులో భారీగా వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు వరదమయమయ్యాయి. బుధవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల నుంచి మొదలైన వర్షం ఏకధాటిగా కురిసింది. 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీగా గాలులు.. వర్షం వల్ల బెంగళూరు నగరం మొత్తం అతలాకుతులమైంది. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. శివాజీ నగర్ ప్రాంతంలో ఓ ఆసుపత్రి వద్ద గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఏడుగురు చనిపోయారు.

వాస్తవానికి ఎండాకాలంలో వర్షాలు కురవడం అత్యంత అరుదు. కానీ ఇటీవల కాలంలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పైగా క్లౌడ్ బరెస్టింగ్ మాదిరిగా వర్షాలు కురవడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ సంవత్సరం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడిందని.. అందువల్లే ఈ మార్పులు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper