Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల్లో సుగాలి ప్రీతి( sugali Preeti) కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసు అనేక కీలక మలుపులు తిరిగింది. కానీ ఇప్పటికీ విచారణ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసు విచారణ ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. కేసు రిఓపెన్ చేసి నిందితులను పట్టుకుంటామని.. శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శన అస్త్రంగా మార్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా దీనినే ఎక్కువగా హైలెట్ చేశారు. అయితే తాజాగా ఈ కేసు విచారణ నుంచి సిబిఐ తప్పుకోవడానికి ప్రయత్నించింది. ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇన్నాళ్ళ పోరాటానికి ఫలితం లేకుండా పోయిందని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదని వాపోయింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన చేసింది ఆమె.
* 8 ఏళ్ల కిందట ఘటన
2017 ఆగస్టు 19న అనుమానాస్పదంగా మృతి చెందింది సుగాలి ప్రీతి( sugali Preeti ) అనే పదో తరగతి చదువుతున్న విద్యార్థిని. కర్నూలు శివారులోని లక్ష్మీ గార్డెన్ లో నివాసముంటున్న రాజు నాయక్, పార్వతి దేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి. నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతుండేది. అయితే సుగాలి ప్రీతి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కానీ ఇది ఆత్మహత్య కాదని.. స్కూల్ యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం చేసిన వైద్యులు కూడా.. ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు నిర్ధారించారు. ఈ ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
* అప్పట్లో హత్యగా నిర్ధారణ
అప్పట్లో ఈ ఆధారాలను ప్రామాణికంగా తీసుకుని పోలీసులు నిందితులపై ఫోక్సో సెక్షన్( foxo section ) 302, 201, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు నియమించారు. అయితే ఈ కమిటీ సైతం లైంగిక దాడి చేసి.. హత్య చేసినట్లు నిర్ధారించింది. ఈ తరుణంలో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. అప్పటినుంచి మృతురాలి తల్లిదండ్రులు పోరాట బాట పట్టారు. కాగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి దేవి దివ్యాంగురాలు. ఆమె జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. తప్పకుండా సర్కార్ పై ఒత్తిడి పెంచి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఇంతలో ప్రభుత్వం మారింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. కాదు విచారణ మాత్రం ప్రారంభం కాలేదు.
* గత ఐదేళ్లుగా ప్రచార అస్త్రం
గత ఐదేళ్లుగా సుగాలి ప్రీతి కేసును ప్రస్తావిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan). ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసును రీఓపెన్ చేసి విచారణ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఎంతవరకు కేసు విచారణ మాత్రం ప్రారంభం కాలేదు. అదే సమయంలో సిబిఐ వెనక్కి తగ్గింది. తమకున్న పని ఒత్తిడితో ఈ కేసు విచారణ చేపట్టలేమని.. ఈ కేసులో అంతటి సంక్లిష్టత లేదని కూడా తేల్చి చెప్పింది. ఇటువంటి పరిస్థితుల్లో బాధితురాలు తల్లి మీడియా ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు తీరును తప్పు పట్టారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదన్నారు. ప్రస్తుతం ఆమె కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కూటమి ప్రభుత్వానికి, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్!
కడిగి పారేసిన సుగాలి ప్రీతి తల్లి! #JusticeForSugaaliPreethi #PawanKalyan #AndhraPradesh #UANow pic.twitter.com/WZwyF4hufC
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) February 20, 2025
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Sugali preetis mothers direct question to the alliance government and deputy cm pawan kalyan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com