ChandraBabu Naidu Wedding Card : టాలీవుడ్ దిగ్గజం.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్టీఆర్ కూతురును వివాహం చేసుకొని చంద్రబాబు నక్క తోక తొక్కాడు. ఏకంగా మామను పక్కకు తోసి టీడీపీ పగ్గాలు చేపట్టి నాటి నుంచి నేటి వరకూ ఏపీకి సీఎంగా నిలబడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు పిల్లనిచ్చాడు నాడు ఎన్టీఆర్. అనంతరం తన పార్టీలోకి తీసుకున్నారు.

సెప్టెంబర్ 10వ తేదీ చంద్రబాబు పెళ్లి రోజు. ఈ సందర్భంగా అప్పటి ఆయన పెళ్లికార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరితో తన వివాహం అని చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఆ కార్డులో ఉంది.
Also Read: అవసరాన్ని బట్టి మారుతున్న ఏపీ ‘ఆదాయం’?
చంద్రబాబు-భువనేశ్వరిల పెళ్లి 1981 సెప్టెంబర్ 10న చెన్నైలో జరిగింది. అప్పటికే చంద్రబాబు నాడు ఏపీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ సినిమాల్లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. దీంతో ఈ పెళ్లికి సినీ, రాజకీయ వర్గాల్లో ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. రాజకీయ ప్రముఖులు, సినీ తారలంతా ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇక కట్నం విషయానికి వస్తే.. చంద్రబాబు తీసుకున్న కట్నం గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. కానీ చంద్రబాబు నయా పైసా కట్నం మామ ఎన్టీఆర్ నుంచి తీసుకోకుండా ఈ పెళ్లి చేసుకున్నారు. చంద్రబాబు అడిగింది లేదట.. ఎన్టీఆర్ ఇచ్చింది లేదట.. ఇప్పుడూ ఈ రెండు కుటుంబాల మధ్య కట్నం అనే ప్రస్తావనే వినిపించలేదట.. కానీ వివాహాన్ని మాత్రం అంగరంగ వైభవంగా జరిపించారు.
నాడు చంద్రబాబు స్వయంగా తన పెళ్లికి ఆహ్వానించిన లేఖ మాత్రం ఇప్పటికీ వైరల్ అవుతోంది. నాటి పసుపుపచ్చని పాత రాతలో ఈ లేఖ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.
Also Read: ఏపీలో పీఆర్సీ వివాదం మళ్లీ రాజుకుందెందుకు..? సమస్య ఎక్కడ వచ్చింది..?
[…] Indian marriage system: ప్రపంచంలోని పాశ్చాత్యా దేశాల్లో డేటింగ్ లు.. పిల్లలను కనడాలు.. విడిపోవడాలు చాలా కామన్. కానీ మన సనాతన భారతీయ సంప్రదాయంలో ఇంకా కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఉంది. పెద్ద కుటుంబాలు లేకపోయినా చీకు చింతా లేని చిన్న కుటుంబాలు బలంగానే ఉన్నాయి. భార్య, భర్త , పిల్లల వరకూ కలిసే ఉంటున్నారు. పిల్లలకోసం అయినా కలిసి సంసారం చేసే దంపతులు ఎందరో.. అన్నింటికి మించి ఓర్పు, నేర్పుతో జీవనం సాగించి కలకాలం విడిపోకుండా ఉంటున్నారు. […]
[…] AP Income: ఏపీలో ప్రభుత్వ ఆదాయంపై గందగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) ఏపీ ఆదాయంపై ఒక రిపోర్ట్ ఇస్తే.. ఏపీ సర్కారు మాత్రం మరో నివేదిక ఇస్తుండటం విడ్డూరంగా మారింది. దీంతో జగన్ సర్కార్ అవసరాన్ని బట్టి ఆదాయాన్ని పెంచడం, తగ్గించడం వంటివి చేసి చూపెడుతూ ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజలను మోసం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. […]
[…] AP Covid19 cases: ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చేయిదాటిపోయేలా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకూ 5వేలలోపు నమోదైన కేసులు గడిచిన 24 గంటల్లో ఏకంగా 10వేలు దాటాయి. చూస్తుంటే థర్డ్ వేవ్ ఏపీలో ఖాయంగా కనిపిస్తోంది. ఒక్కరోజులోనే దాదాపు డబుల్ కేసులు కావడం.. వైరస్ విస్తృతిని సూచిస్తోంది. దీన్ని బట్టి ఏపీలో కరోనా విజృంభిస్తోందని తెలుస్తోంది. […]
[…] AP Politics: రాబోయే సాధారణ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టాయి. అధికార వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ పొత్తు దిశగా ఆలోచిస్తున్నాయి. అయితే ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందా? లేక ద్విముఖ పోటీ ఉంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. […]
[…] Covid 19: కలియుగం అంతం అవడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం ఉంది. అయితే 2000, 2020, 2040, 2064 సంవత్సరాల్లో ప్రపంచ అంతం అవుతుందనే అనేక కథనాలు ప్రసారం అయ్యాయి. ఆ సమయం వచ్చే నాటికి ఇవన్నీ కూడా ఉట్టి పుకార్లుగానే నిలిచిపోయాయి. కాగా కొన్ని కొత్తకొత్త వైరస్ లు పుట్టికొచ్చి మానవళికి సవాళ్లు విసురుతుండటం మాత్రం చర్చనీయాంశంగా మారింది. […]
[…] Sankranthi in Canada: తాకా (తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా) జనవరి 15వ తేదీ, 2022 శనివారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. కెనడాలోని టొరంటో నగరంలోని శ్రుంగేరి కమ్యూనిటీ సెంటర్ (SVBF ఫౌండేషన్) నందు నిర్వహించి సామజిక మాధ్యమాల (Youtube, Twitter, Instagram, Facebook) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసారు. ఈ కార్యక్రమాన్ని వందలాది మంది అంతర్జాలంలో వీక్షించి విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి అనిత సజ్జ, మహమ్మద్ ఖాజిల్, విద్య భావనం, మరియు రేణు కుందెమ్ వ్యాఖ్యాతలు గా వ్యవహరించారు. […]
[…] Also Read: చంద్రబాబు పెళ్లి పత్రిక వైరల్.. కట్నం … […]
[…] Also Read: చంద్రబాబు పెళ్లి పత్రిక వైరల్.. కట్నం … […]