Stylish Politician: రాజకీయ నాయకుడు అనగానే పెద్దరికం, హుందాతనం, పైగా భారీ పర్సనాలిటీ.. కాస్త పొట్ట.. ఇలాంటి ఆహార్యం ఉన్న వ్యక్తినే ఉహించుకుంటాం. కానీ. నేటి రాజకీయాల్లో ఎందరో యువ నాయకులు హీరో పర్సనాలిటీతో రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువ రాజకీయ నాయకుడు ఏకంగా స్టైలీష్ స్టార్ గా మారిపోయాడు. దేశ రాజధానిలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ షోలో ఆ స్టైలీష్ పొలిటీషియన్ వచ్చి అలా స్టైల్ వాక్ చేశాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ స్టైలీష్ పొలిటీషియన్ పిక్స్, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరు ఆ నాయకుడు అంటే.? చీపురు గుర్తు పార్టీ మాజీ ఎంపీ, ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే అయిన రాఘవ్ చద్దా. దేశ రాజధానిలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ షోలో ఆయన పాల్గొన్నారు. మొత్తానికి రాఘవ్ చద్దా పొలిటిషన్ నుంచి ఫ్యాషన్ స్టార్ గా మారిపోయాడు.

పవన్ సచ్‌దేవ్ డిజైన్ చేసిన బ్లాక్ కలర్ లెదర్ జాకెట్‌తో రాఘవ్ చద్దా అలా అలా ర్యాంప్ వాక్ చేస్తూ వెళ్తుంటే..అచ్చం హీరోలాగే కనిపించాడు. అసలు ఒక ఎంపీ ఇలా కలర్ ఫుల్ షోకి అటెండ్ కావడమే అరుదు. అలాంటిది పార్టిసిపేట్ చేస్తే.. ఇక ఎలా ఉంటుంది ? అందుకే.. ఎంపీ గారి ర్యాంప్ వాక్ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read: AP Secretariat: సచివాలయానికి వస్తున్న అప్పులోళ్లు.. జగన్ సర్కార్ పరువు గాయబ్..!
నిత్యం పార్టీ మీటింగ్స్ అంటూ పొలిటికల్స్ స్పీచ్ లతో మధ్యమధ్యలో ఎలక్షన్ క్యాంపెన్‌లలో ఫుల్ బిజీగా కనిపించే రాఘవ్ చద్దా.. ఇలా ఫ్యాషన్ షోలో తళుక్కున మెరిసి అదిరిపోయే వాక్ తో కేకలు పెట్టించారు. అన్నట్టు యంగ్ ఎంపీ రాఘవ్ చద్దా మరో నటుడు అపర్‌శక్తి ఖురానాతో కలిసి ర్యాంప్ వాక్ చేయడం మరో విశేషం. ఇంతకీ ఈ రాఘవ్ చద్దాకి మంచి రాజకీయ ముద్ర ఉంది.

గతంలో ఈయన ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే, రీసెంట్‌గా జరిగిన పంజాబ్ ఎన్నికల్లోనూ సైతం రాఘవ్ చద్దా అంతా తానై వ్యవహరించి ముందుకు వెళ్లారు. పంజాబ్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా వ్యవహరించి భగవంత్‌మాన్‌ని సీఎం పీఠం ఎక్కేందుకు క్రీయాశీలంగా వ్యవహరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేసుకున్నారు.

Also Read: Somu Veeraju: పవన్ కళ్యాణ్ సీఎం.. 2024లో అధికారం.. ప్రత్యర్థులకు వ్యూహాలు చిక్కనివ్వని సోము వీర్రాజు
Recommended Video: