Weather Report: మా చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే పండుగే. ఎప్పుడు స్కూల్స్ అయిపోతాయా? ఎండాకాలం సెలవులు వస్తాయా? అని ఆతృతగా ఎదురుచూసేవారు. స్కూలు మొత్తం బంద్ కాగానే మామిడి తోటలు, బత్తాయి తోటలు.. చెరువుల్లో ఈత కొట్టడానికి తరలివెళ్లేవారు. అప్పుడేంటో కానీ అస్సలు ఎండలు ఇంత తీవ్రంగా ఉండేవి కావు. అప్పటి ఎండలు పెద్దగా కొట్టినట్టే అనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మే వరకూ ఎందుకు.. ఈ మార్చిలోనే ఎండలు మాడు పగులకొడుతున్నాయి. పచ్చదనాన్ని లేకుండా చేయడమే మానవాళికి శాపమైంది. ఎండతీవ్రతను తగ్గించే చెట్లను కొట్టేసి తేమ లేకుండా చేసిన పాపం ఇప్పుడు చుట్టుకుంటోంది. అదే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం..

సూరీడు భగభగమండే అగ్ని గోళంగా కనిపించబోతున్నాడు. బయటకెళితే మీ మాడు పగలడం ఖాయం. ఆ తీవ్రమైన ఎండలకు వడదెబ్బలు, నీరసించిపోవడాలు.. సత్తువ తగ్గి అనర్థాలు జరగవచ్చు. అందుకే ‘రాగల 5 రోజులు జాగ్రత్త’ అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం పూట నట్టెండలో ఎటూ వెళ్లకపోవడమే మంచిది సలహా ఇచ్చింది.
Also Read: NTR Fans Negative Comments On Rajamouli: రాజమౌళి పై విరుచుకుపడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. వీడియో వైరల్
తెలంగాణలో వాతావరణం మరీ హాట్ గా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 5 రోజుల్లో ఏకంగా 2 నుంచి 3 డిగ్రీల మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో అస్సలు తేమ లేని పొడి వాతావరణం ఉండబోతోందట.. దీనికి విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడిన ఉపరితల ద్రోణియే కారణం. దీని వల్ల తేమ తక్కువై.. ఎండ ఎక్కువై మాడు పగులకొడుతుంది.
సో పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న వారు.. మహిళలు ఈ ఎండల్లో మధ్యాహ్నం తర్వాత బయటకు వెళ్లకపోవడమే మంచిది. అత్యవసరం అనుకుంటే గొడుగు కానీ.. తలకు ఏదైనా చుట్టుకొని వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. ఇక ఆరోగ్యానికి మంచినీళ్లు, పళ్ల రసాలు, పండ్లు తినాలని సూచిస్తున్నారు.
మార్చి లోనే ఈ ఎండలు ఇలా దంచికొడుతుంటే.. ఇక మే నెల వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయమేస్తోంది. మే లో రోకళ్లు పగిలేలా ఎండలు కొడుతాయి. ఈ ఎండలకే తట్టుకోలేకపోతున్న జనాలు.. వాటికి ఎలా తట్టుకుంటారో చూడాలి. ఎందుకైనా మంచి ప్రజలు మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకపోతేనే మంచిదని వాతావరణ శాఖ సూచిస్తోంది.
Also Read: RRR Latest Collections : అన్నీ చోట్ల అదే విజృంభణ.. !