
MLA Dayakar Vs Guvwala Balraj : తిట్ల దండకంలో దేశంలో రాజకీయ నేతలకు పోటీ పెడితే తెలంగాణ నంబర్‌వన్‌లో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఉద్యమ సమయంలో తెలంగాణవాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మొదలు పెట్టిన భాష.. రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లయినా తగ్గుముఖం పట్టకపోగా పెరుగుతూనే ఉంది. మర్యాదకు కేరాఫ్‌గా నిలవాల్సిన అసెంబ్లీలోనే ముఖ్యమంత్రితో సహా మన నేతలు భూతుపురాణం వళ్లిస్తున్నారు. ఇక డిబేట్లలోనూ ఆ సంస్కృతి మొదలైనట్లు కనిపిస్తోంది. పది, పన్నెండేళ్ల క్రితం ఒకసారి టీవీ9 డిబేట్‌లోనే బాల్క సుమన్, కాంగ్రెస్ నాయకుడు దుర్భాషలాడి తన్నుకునే వరకూ వెళ్లారు. తాజాగా అదే టీవీ9 డిబేట్‌లో మరోమారు గువ్వల బాలరాజు, కాంగ్రెస్ నేత దయాకర్ తిట్ల దండకం అందుకున్నారు. ఇక్కడ మారింది యాంకర్ మాత్రమే నాడు రవిప్రకాశ్ డిబేట్ కండక్ట్ చేయగా, నేడు రజినీకాంత్ ఉన్నారు. అదొక్కటే తేడా మిగతా అంతా సేమ్ టూ సేమ్.
రాజకీయాలపై చర్చ..
తాజా రాజకీయాలపై టీవీ9లో డిబేట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్‌నేత అద్దంకి దయాకర్, బీజేపీ నేతల ప్రేమేందర్ హాజరయ్యారు. అయితే డిబేట్ సందర్భంగా బాలరాజు, దయాకర్ మధ్య మాటమాట పెరిగింది. ఈ సందర్భంగా దయాకర్, ఎమ్మెల్యేను బాలరాజు అని పిలిచాడు. దాంతో బాలరాజు ఊగిపోయాడు.
పేరుతో కాకుండా ఏమని పిలవాలి రాజా..
అయితే ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంట్లో గువ్వల బాలరాజు తనను పేరు పెట్టి పిలవొద్దు అని అనడం కనిపించింది. తల్లిదండ్రులు పేరు పెట్టిందే పిలవడానికి కానీ, బాలరాజు మాత్రం తనను అందరినీ పిలిచినట్లు పేరుతో పిలవొద్దు అని దయాకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దయాకర్ కూడా మండిపడ్డారు. కేసీఆర్ దగ్గర ఊడిగం చేసుకో అంటూ దయాకర్ కూడా బాలరాజుకు కౌంటర్ ఇచ్చారు. యాంకర్ ఎంత వారించినా ఇద్దరు నేతలు తగ్గలేదు. అయితే ఇద్దరూ దళిత నేతలే కవవడం ఇక్కడ కొస మెరుపు. అయితే ఇప్పుడు నెటిజన్లు కూడా ఈ వీడియోపై సెటైర్లు పోస్టు చేస్తున్నారు. ముఖ్యమంగా కాంగ్రెస్ నేతలు అయితే.. ‘ ఏమిరా బాలరాజు నీతో ఉపయోగం.. కొంతమంది బాలరాజు అనకుండా బా..వ్ రాజు అనాలా అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది కేసీఆర్ హామీలను గుర్తుచేస్తూ అవి అడగవా బాలరాజు అని నిలదీస్తున్నారు. దళిత బంధు ఏమైందని ప్రశ్నిస్తున్నారు.
హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనూ..
హుజూరాబాద్ ఎన్నికల సమయంలో, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలోనూ గువ్వల బాలరాజు నెటిజన్లకు బుక్కయ్యారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ గెలిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానన్నాడు. తర్వాత ఈటల గెలిచాడు. దీంతో నెటిజన్లు బాలరాజుకు ఫోన్లు చేసి రాజీనామా ఎప్పుడు చేస్తావని ప్రశ్నించి ఆ ఆడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక ఎమ్మెల్యే కొనుగోలు అంశం తర్వాత కూడా ఇలాగే నెటిజన్లు బాలరాజును ఓ ఆటాడుకున్నారు. తాజాగా మరోమారు అరుసుకుంటున్నారు.