Homeజాతీయ వార్తలుHoliday : స్టూడెంట్స్ కు ఇక పండగే.. ఇక పై ప్రతి నెల నాలుగో శనివారం...

Holiday : స్టూడెంట్స్ కు ఇక పండగే.. ఇక పై ప్రతి నెల నాలుగో శనివారం హాలిడే !

Holiday : కొంతమంది స్టూడెంట్లకు ప్రతి రోజూ స్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే చాలా బోర్. ప్రతి రోజు ఈ రోజు సెలవొస్తే బాగుండు ఎంజాయ్ చేయవచ్చని అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. స్కూల్ కు వెళ్లే స్టూడెంట్స్ సెలవు వచ్చిందంటే ఎగిరి గంతేస్తారు. టీచర్లు ఇచ్చిన హోమ్ వర్క్ త్వరత్వరగా కంప్లీట్ చేసుకుని ఎంచక్క ఆడుకోవచ్చని అనుకుంటారు. అదే కాలేజీ స్టూడెంట్స్ అయితే ఫ్రెండ్స్ లో షికారు చేయవచ్చు. లేకపోతే క్రికెట్ ఆడవచ్చని భావిస్తుంటారు. ఎక్కువ రోజులు సెలవొస్తే ఊరెళ్లి రావొచ్చని చాలా ఆశపడుతుంటారు. ప్రస్తుతం సెలవులు రావాలే గానీ రకరకాలుగా ప్లాన్ చేసుకుంటుంటారు స్టూడెంట్స్. మరి వారి కోరికను మించి సెలవులు వస్తే..? వాళ్ల ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు.

ప్రస్తుతం అదే ఆనందంలో ఉన్నారు. జేఎన్ టీయూ విద్యార్థులు.. జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ (JNTU) గురువారం అంటే నిన్న ఓ కీలక ప్రకటన జారీ చేసింది. ఇకపై యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, ఆఫీసులకు ప్రతి నెలా నాలుగో శనివారం హాలీడే ఇస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. 2008కి ముందు ఉన్న సెలవు విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టినట్లు జేఎన్టీయూ కొత్త వీసీ కిషన్ కుమార్ రెడ్డి ఈ మేరకు ప్రకటనలో స్పష్టం చేశారు. యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని విభాగాల్లోని అధికారులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సెలవులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాజాగా చేసిన ప్రకటన ఈ నెల 22 నుంచే అమలులోకి రానుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జేఎన్టీయూ తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదు. 2008కి ముందు కూడా దీనిని అమలు చేశారు. అయితే 2008 తర్వాత అనివార్య కారణాల వల్ల ఈ విధానాన్ని రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు దానిని పునరుద్ధరిస్తున్నట్లు యూనివర్సిటీ వీపీ ప్రకటించారు. తాజా నిర్ణయంతో విద్యార్థులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాలుగో శనివారం సెలవు ఇచ్చినందున, మిగిలిన రోజుల్లో పనివేళలను పెంచుతామని వైస్‌ చాన్స్‌లర్‌ కిషన్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version