YCP Govt: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు మాములుగా ఉండరనేది అందరికీ తెలిసిందే. ఆయన్ను ఏమైనా అంటే ఫ్యాన్స్ ఎంతకైనా తెగిస్తారు. ఆ మధ్యలో ఓ టీడీపీ నేత ముఖ్యమంత్రిని పట్టుకుని బోసిడికే అని సంబోధించినందుకు ఆయన ఇంటిపై వైసీపీ లీడర్లు యుద్ధం ప్రకటించారు.

ఇంటికెళ్లి మరీ నానా రభస సృష్టించారు. ఫర్నీచర్, కారు అద్దాలు, ఇంట్లోని వస్తువులను పగులగొట్టేశారు. ఆ టైంలో ఆ నాయకుడు లేడు కాబట్టి బతికిపోయారు. ఒకవేళ ఇంట్లో ఉంటే ఆయన పరిస్థితి ఏంటని సాధారణ ప్రజలు ఆలోచనలో పడ్డారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి జగన్‌కు అభిమానులు బాగానే ఉన్నారు.జగన్ కోసం ప్రాణం ఇచ్చేంత అభిమానులు కూడా ఉన్నారని కొందరు సీనియర్ లీడర్లు చెబుతుంటారు.
2019లో ఆ అభిమానమే ఓట్ల రూపంలో రాలి జగన్ ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది. ఆ తర్వాత జగన్ కూడా తనదైన పాలనా చేస్తూ ప్రజల్లో ఆదరాభిమానాలను పొందారు. ఫలితంగా ఏపీలో జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే, తాజాగా ఏపీలోని కొన్ని గోదావరి జిల్లాల్లో ఉన్న వైసీపీ అభిమానులు జగన్ పట్ల వింత అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఎక్కడ చూడు జగనన్న ఉన్నాడు జాగ్రత్తా అంటూ ఫ్లెక్స్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో కొత్తగా రోడ్ల నిర్మాణం చేపట్టే వరకు ఈ బోర్డును ఎవరైనా తీస్తే ఇదే మట్టిలో కలిసిపోతారు అంటూ వింతగా రాసుకొచ్చారు. వీటిని జనసేన పార్టీ లీడర్లు సోషల్ మీడియాలో పోస్టు చేయగా తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read: చంద్రబాబు వల్ల జగన్ ప్రాణాలకు ముప్పు.. బాంబు పేల్చిన మంత్రి!
ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇలాగే చెడిపోయిన రోడ్లను బాగుచేయాలని కోరుతూ ఇలాగే జగనన్న పేరిట బోర్డులను ఏర్పాటు చేశారు. అంటే నేరుగా తమ అభిమాన ప్రభుత్వాన్ని విమర్శించలేక ఈ విధంగా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఏపీలో చెడిపోయిన రోడ్లను వెంటనే బాగుచేయించాలని పరోక్షంగా జగన్ సర్కారుకు హెచ్చరికలు చేస్తున్నారు. అప్పట్లో ఇలాంటి బోర్డులపై ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కనీసం ఈసారైన జగన్ ప్రభుత్వం గోదావరి జిల్లాల్లోని ప్రజల ఆవేదనను గుర్తించి వారి కోసం కొత్త రోడ్ల నిర్మాణం చేస్తారో లేదో వేచిచూడాల్సిందే.
Also Read: చంద్రబాబు బాటలో పవన్ కల్యాణ్.. టార్గెట్ వైసీపీ..!