Homeజాతీయ వార్తలుCh. Vittal: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పోరుబిడ్డ సీహెచ్. విఠల్ ప్రస్థానం

Ch. Vittal: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పోరుబిడ్డ సీహెచ్. విఠల్ ప్రస్థానం

Ch. Vittal: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉద్యమ నేతల్లో సీహెచ్ విఠల్ ఒకరు. తెలంగాణ పోరాటానికి ఆయువై నిలిచారు ప్రభుత్వ ఉద్యోగులు. తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించిన ఐదుగురు కీలక వ్యక్తుల్లో సీహెచ్ విఠల్ ఒకరు. ఈయనను ‘తెలంగాణ విఠల్’ అని కూడా ఉద్యోగులు పిలుస్తుంటారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ‘మిలియన్ మార్చ్, సాగరహారం’ సహా ఎన్నో పోరాటాల్లో విఠల్ కీలక భూమిక పోషించారు. తెలంగాణ ఉద్యమ మూలాలు ప్రారంభమైన 1996 నుంచి రాష్ట్రం ఏర్పడ్డ 2014 జూన్ 2 వరకూ విఠల్ అన్ని పోరాటాల్లో ‘నేను సైతం’ అని పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కోదండరాం సహా ఎంతో మంది కీలక ఉద్యమనేతలతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు.

vittal-jpg

విఠల్ లాంటి ఉద్యోగ నేతల సారథ్యంలోనే సకలజనుల సమ్మెతో కేంద్రం మెడలు వంచారు. తెలంగాణ ఉద్యమానికి నాడు ప్రభుత్వ ఉద్యోగులే ఊపిరి. ఈ ఉద్యమం ఇలా పటిష్టంగా తయారుకావడానికి నాటి ఉద్యోగ సంఘాల నేతలే ఆయువుపట్టు. ఉద్యమ తొలినాళ్లలో అసలు ఎలా పోరాటం చేయాలో వ్యూహాలు రచించిన వారిలో తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత విఠల్ ఒకరు. తెలంగాణ జేఏసీ ప్రధాన కార్యదర్శిగా.. కోచైర్మన్ గా విఠల్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

నాడు ఉద్యోగ సంఘం నేతగా విఠల్ చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం. తెలంగాణ వచ్చాక టీఎస్.పీఎస్.సీ లో కీలక పదవిని దక్కించుకున్నారు. ఆయన పదవీ కాలం ఏడాది క్రితం ముగిసింది. అనంతరం తాజాగా బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

తెలంగాణలో ఉద్యోగాల నియామకాల పట్ల కేసీఆర్ సర్కార్ తీరును విఠల్ ముందు నుంచి తప్పుపడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ డిజైన్ మార్చడాన్ని విఠల్ విమర్శించారు. ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసే విషయమై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో విఠల్ తీవ్రస్థాయిలో అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతల ఆహ్వానం మేరకు బీజేపీలో చేరారు. బీసీ సామాజికవర్గానికి చెందిన విఠల్ చేరికతో తెలంగాణ బీజేపీ మరింత బలోపేతం అవ్వనుంది.

-సీహెచ్. విఠల్ ప్రస్థానం
రంగారెడ్డి జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో 1966 మే 27న సీహెచ్ విఠల్ జన్మించారు. మున్నూరు కాపు సామాజికవర్గంలో బీసీగా కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కారు.. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదివిన విఠల్ అనంతరం స్కాలర్ షిప్ పై సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో ఉండి విద్యాభాస్యం కొనసాగించారు. పాఠశాలల స్థాయిలోనే ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్ గా పనిచేశారు. అప్పటికే బీజేపీ భావజాలాన్ని నరనరాన నిలుపుకున్నారు. తాజాగా బీజేపీ గూటికి చేరడంతో ఆయన సొంతింటికి చేరుకున్నట్టైంది.

-విఠల్ ఏం చదివారు?
తెలంగాణలోని హైదరాబాద్ లో గల ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ (ఎల్ఎల్.బి) ఎంఫిల్ విద్యనభ్యసించారు.

-విఠల్ సాధించిన పదవులు
విఠల్ రాజకీయ విశ్లేషకుడు, సమకాలన రాజకీయాలపై మంచి పట్టు ఉన్న నిపుణుడుగా పేరుగాంచారు. పెద్ద పెద్ద చర్చల్లో పాల్గొని తనదైన వాదనతో అదరగొట్టారు. ప్రజల్లో తన ప్రసంగాలతో స్ఫూర్తిని నింపాచరు. ప్రధాన న్యూస్ చానెల్స్ లో చర్చల్లో పాల్గొన్నారు.
– ఉద్యమకాలంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి కో చైర్మన్ గా విఠల్ వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారు.
-తెలంగాణ రాష్ట్రం వచ్చాక ‘రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ’సభ్యుడిగా నియామకం అయ్యారు. 2014 వరకూ తెలంగాణ ఉద్యోగ సంఘాల అసోసియేషన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ గా ఉన్నారు.
-మాతృభూమి ఫౌండేషన్ చైర్మన్ గా విఠల్ ఎన్నో సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేశారు.
-హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో లాకాలేజీ స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.
-1987లో ఒక ప్రముఖ దినపత్రికలో జర్నలిస్టుగా కెరీర్ ఆరంభించారు.
-శ్రీరామ చంద్ర డిగ్రీ కాలేజీలో 4 ఏళ్లపాటు లెక్చరర్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేశారు.
-1991లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2 సర్వీసుకు అర్హత సాధించి ఆడిటర్ గా ఎంపికయ్యారు.
-24 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించారు. ఉద్యోగ సంఘాల నేతగా ఎదిగారు.

-విఠల్ చేసిన పోరాటాలు
-వెల్ఫేర్ స్టూడెంట్ లెవల్ ఆర్గనైజేషన్ ప్రోగ్రాములు నిర్వహించారు.
-1996లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఎన్నో సెమినార్ లు, సభలు, సమావేశాలు, ఉద్యోగులు, సంఘాల నేతలతో తెలంగాణ ఆవశ్యకతను వివరించారు.
-2001లో తెలంగాణ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2014 డిసెంబర్ 17వరకూ ఆ బాధ్యతలు చురుకుగా నిర్వర్తించారు.
-గిర్ గ్లానీ కమిటీ, హౌస్ కమిటీ, ఇతర కమిటీలకు కీలక సూచనలు అందించారు.
-జేసీసీ కో చైర్మన్ గా తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యోగులను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

-విఠల్ కెరియర్ లోని హైలైట్స్
-1987లో విఠల్ 21 ఏళ్ల వయసులోనే తన సొంత గ్రామానికి సర్పంచ్ గా ఎంపికయ్యారు. గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు.
-2004లో ఇంటెలెక్చువల్స్ ఫోరం జనరల్ సెక్రటరీగా సేవలందించారు.
-2009 యాంటీ సూసైడ్స్ అవేర్ నెస్ కమిటీ మెంబర్ గా నియమితులయ్యారు.
-సమాజిక సమస్యలపై పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాశారు.
-ఉద్యోగ జీవితంలో నీతిగా నిజాయితీగా ఉంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు.

-విఠల్ స్కిల్స్
-రాజకీయ విశ్లేషకుడిగా చాలా టీవీ చానెల్స్ లో చర్చల్లో పాల్గొన్నారు.
-సమాజిక సేవా కార్యక్రమాల్లో విఠల్ పాల్గొన్నారు.
-సెమినార్ లు, కాన్ఫరెన్స్ లు, సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రాముల్లో ఎన్నో స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు.

-ఇతర కార్యకలాపాలు
-విద్యార్థిగా ఉన్న సమయంలో ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్ గా.. సంఘ్ ప్రచారక్ గా పనిచేశారు.
– విఠల్ చదువుకునే సమయంలో ఏబీవీపీ పోరాటాల్లో పాల్గొన్నారు.
-ఉద్యోగ అసోసియేషన్ లీడర్ గా ప్రభుత్వ ఉద్యోగులను ముందుండి నడిపించారు.

-విఠల్ కు ఏఏ భాషలు వచ్చు?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్

-విఠల్ వ్యక్తిగత సమాచారం
-విఠల్ తల్లిదండ్రులు: మానయ్య పటేల్-సుశీల
-భార్య : విజయలక్ష్మీ
-పిల్లలు: వైష్ణవి (కూతురు) డాక్టర్, వివేక్ (కుమారుడు) సాఫ్ట్ వేర్ ఇంజినీర్

 

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular