Homeజాతీయ వార్తలుStock Market : భారీ నష్టాల తర్వాత లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు...

Stock Market : భారీ నష్టాల తర్వాత లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు టాప్ గెయినర్స్ ఇవే

Stock Market : స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ మంగళవారం కొంత లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్ బెల్ తో మార్కెట్ పెరిగింది. హెచ్‌ఎంపీ వైరస్(HMPV Virus) కేసులు పెరుగుతున్న క్రమంలో నిన్న మార్కెట్‌లో భారీ పతనం కనిపించింది. అయితే ఉదయం నుండి కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్(Sensex) 85 పాయింట్ల లాభంతో 78020 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ(NIfty) 65 పాయింట్ల లాభంతో 23680 వద్ద ప్రారంభమయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన వెంటనే, మరింత కొనుగోళ్లు కనిపించాయి. బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ,సెన్సెక్స్ మరింత లాభపడ్డాయి.

ట్రేడింగ్‌(Trading)లో నిఫ్టీ 23750 స్థాయిని దాటింది. రోజువారీ చార్ట్‌లో సోమవారం నాటి పెద్ద బేరిష్ క్యాండిల్ తర్వాత చిన్నదైన కానీ సమానమైన బుల్లిష్ క్యాండిల్‌ను తయారు చేసేందుకు నిఫ్టీ సిద్ధమైంది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు, నిఫ్టీ 140 పాయింట్లు పెరిగింది. చార్టులో బుల్లిష్ క్యాండిల్ కనిపించింది. మొత్తం రోజు ట్రేడింగ్ ఇంకా పూర్తి కానప్పటికీ రోజువారీ చార్ట్‌లో బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తోంది.

ప్రారంభ ట్రేడ్‌లో నిఫ్టీ 50 ప్యాక్ నుండి 4శాతం లాభంతో ONGC టాప్ గెయినర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. నిఫ్టీ50లో టైటాన్(Titan) కంపెనీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బ్రిటానియా(Britania), హిందాల్కో, బిపిసిఎల్ ఇతర టాప్ గెయినర్లుగా కనిపిస్తున్నాయి. నిఫ్టీ 50 టాప్ లూజర్లను పరిశీలిస్తే బజాజ్ ఆటో, అపోలో హాస్పిటల్స్, హీరో మోటో కార్ప్(Hero moto corp) వంటి కౌంటర్లు కనిపిస్తున్నాయి.

అంతకుముందు సోమవారం, త్రైమాసిక అప్ డేట్లు , హెచ్ ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఆందోళనల తర్వాత భారతీయ మార్కెట్లు పడిపోయాయి. భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది.కొత్త వైరస్‌కు సంబంధించిన ఆందోళనలు తగ్గే వరకు మార్కెట్ అస్థిరంగానే ఉంటుందని భావిస్తున్నామని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా అన్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular