https://oktelugu.com/

Jagan Stickers: ఏపీలో స్టిక్కర్ రాజకీయాలు .. చెరిగిపోతే పచ్చబొట్లు వేస్తారేమో

Jagan Stickers: ఏపీలో వైసీపీ సర్కారు ప్రచార పిచ్చికి హద్దే లేకుండా పోతోంది. సంక్షేమ పథకాల ప్రచారానికే వందల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది. సీఎం జగన్ మదిలో ఆలోచన వచ్చిన నాటి నుంచి పురుడుబోసుకున్న వరకూ తన ఆలోచనలను సైతం ప్రకటనలుగా మార్చేసి సొంత పత్రికకు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. పథకానికి సంబంధించి లబ్ధిదారుడు ఖాతాలో నగదు జమకాక ముందే.. తన సొంత పత్రికకు మాత్రం ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు చేరవేస్తున్నారు. చివరకి వారం […]

Written By:
  • Dharma
  • , Updated On : February 14, 2023 / 11:34 AM IST
    Follow us on

    Jagan Stickers

    Jagan Stickers: ఏపీలో వైసీపీ సర్కారు ప్రచార పిచ్చికి హద్దే లేకుండా పోతోంది. సంక్షేమ పథకాల ప్రచారానికే వందల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది. సీఎం జగన్ మదిలో ఆలోచన వచ్చిన నాటి నుంచి పురుడుబోసుకున్న వరకూ తన ఆలోచనలను సైతం ప్రకటనలుగా మార్చేసి సొంత పత్రికకు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. పథకానికి సంబంధించి లబ్ధిదారుడు ఖాతాలో నగదు జమకాక ముందే.. తన సొంత పత్రికకు మాత్రం ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు చేరవేస్తున్నారు. చివరకి వారం వారం ఇసుక ధరలు అంటూ పత్రికకు భలేగా ఆదాయం సమకూర్చిపెడుతున్నారు. కానీ తన చేతిలో మీడియా లేదు అంటూ అడ్డగోలు వాదనకు తెరతీస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ప్రసార మాధ్యమాలనే వినియోగించుకున్న వైసీపీ సర్కారు ఇప్పుడు పథకాల లబ్ధిదారులను కూడా ప్రచారానికి వినియోగించుకోవాలని చూస్తోంది. వారి ద్వారా కావాల్సిన ప్రచారం కల్పించుకోవాలని భావిస్తూ ‘స్టిక్కర్’లను తెరపైకి తెచ్చింది.

    Also Read: Amigos Collections: ‘అమిగోస్’ కి 50 శాతం కి పైగా నష్టాలు..నందమూరి హీరోల విజయయాత్ర కి బ్రేక్

    Jagan Stickers

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.65 కోట్ల ఇళ్లకు తిరిగి వారి తలుపులకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అన్న స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించింది. సచివాలయ వైసీపీ సమన్వయకర్తలు, గృహ సారథులు, వలంటీర్లతో కార్యక్రమాన్నిపూర్తిచేయాలని హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం వలంటీర్లు, సమన్వయకర్తలు, గృహసారథులతో కలిపి 5.65 లక్షల మంది ప్రైవేటు సైన్యం అందుబాటులోకి వస్తుందని.. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని సూచించింది. అయితే ఒక్క తలుపులకే స్టిక్కర్లు కాదు.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల సెల్ ఫోన్లకు కూడా స్టిక్కర్లు అతికించాలని స్పష్టం చేసింది.

    అయితే ఇంటి యజమాని ఫోన్ కే అనుకుంటే పొరబడినట్టే. ఇంట్లో పథకాలు అందుకున్న వారందరి సెల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించాలని ఆదేశించారు. అయితే కొన్ని గ్రామాల్లో ఉత్సాహం చూపించే వలంటీర్లు స్టిక్కర్లు అతికించడం ప్రారంభించేశారు. . ఇదేం బాధ అంటే… అంటే పట్టించుకునేవారు లేరు. ఎంత పథకాలు ఇస్తే మాత్రం ఇంటికి ఒంటికి కూడా స్టిక్కర్లు అంటిస్తారా అని ప్రశ్నిస్తే ఎక్కడ కేసులు పెడతారో.. ఎక్కడ వచ్చి అల్లరి మూక దాడి చేస్తుందోనన్న భయంతో ప్రజలు కిక్కుమనలేని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ ప్రచార పిచ్చితో స్టిక్కర్లతో హోనం ఎక్కిస్తున్నారని ప్రజలు తెగ బాధపడిపోతున్నారు. స్టిక్కర్లు చెరిగిపోతాయని ప్రభుత్వ పెద్దలకు ఆలోచన తడితే ..పచ్చబోట్లు వేయడానికి కూడా వెనుకాడరేమో అని సెటైర్లు పడుతున్నాయి. వైసీపీ సర్కారు ఏపీని మరీ ఆటవిక రాజ్యంగా మార్చేస్తుందన్న విమర్శలు మాత్రం పెరుగుతున్నాయి.

    Also Read: Tummalapalli Kalakshetram: తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చేశారు.. జగన్ పాలనలో అంతే

    Tags