CM Jagan- Liquor Ban: ఏపీ జనాలకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా! నవరత్నాలు అంటే మిల మిల మెరిసేవి కావు. నిలుపునా ముంచేవని.. అధికారంలోకి రాకముందు మద్యం పై దశలవారీగా నిషేధం అమలు చేస్తామని, కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని జగన్ అన్నారు. కానీ వాస్తవ పరిస్థితి వేరు. ప్రజలు కోరుకున్న మద్యం కాకుండా జగన్మోహన్ రెడ్డికి లాభాలు తెచ్చే బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉంచారు.. అదికూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో… అంటే ప్రభుత్వ అధికారులు జగన్ కోసం, ఆయన ఆదాయాన్ని పెంచేందుకు పనిచేస్తున్నారన్నమాట. ఇదంతా పెద్ద సబ్జెక్టు కాని అసలు ఏపీలో ఏం జరుగుతుందో టూకీగా తెలుసుకుందాం.
జరుగుతుంది వేరు
ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని దశలవారీగా నిషేధించి.. దానిని ఫైవ్ స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తామని జగన్ ప్రకటించారు.. కానీ ఇక్కడే జగన్ క్వార్టర్ బాటిల్ మీద కాలేశారు. ముఖ్యమంత్రి చెబుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు తగ్గలేదు.. పైగా ఆదాయం ఎప్పుడూ ఊహించనంత స్థాయిలో పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6000 కోట్లు ఉండే ఆదాయం.. 2021_22 వరకు 25 వేల కోట్లకు చేరింది. బాటిళ్లు, కేసుల వారీగా జగన్ ఈ లెక్కలు చెబుతున్నారు. కానీ ఇటీవల అవి కూడా పెరుగుతున్నాయి. వాటిని మాత్రం జగన్ దాస్తున్నారు. ఒకవేళ ఈ మద్యం వ్యాపారం గనుక లేకుంటే ఏపీలో ఉద్యోగులకు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇక మద్యాన్ని నిషేధించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ అదంతా పూర్తి అబద్ధం.. అక్రమ మద్యం, సారా వ్యాపారం దర్జాగా సాగుతున్నాయి. అది కూడా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో. అక్రమ మద్యం రవాణా, గంజాయి కి సంబంధించి 20,127 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఈ ఆరు నెలల్లో నమోదయ్యాయి.
ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు
ఏపీలో లభించే మద్యం కిక్ ఇవ్వకపోవడంతో మందుబాబుల వ్యసనం ఆధారంగా అక్రమార్కులు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మదాన్ని ఆంధ్రప్రదేశ్లోకి డంప్ చేస్తున్నారు. బాటిళ్ళ వారీగా మద్యం అమ్మకాలు తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ తాగే మనుషుల విషయంలో మాత్రం లెక్కలు దాస్తోంది.
ధరలు అమాంతం పెంచడంతో మద్యం తాగేవారు శానిటైజర్ల బాట పట్టారు. ఇవి తాగి చాలామంది చనిపోయారు.. ఇక ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న మద్యంపై చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటిల్లో విషపూరితమైన పదార్థాలు ఉన్నాయని కొన్ని ల్యాబ్ ల్లో చేసిన నివేదికలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. క్షేత్రస్థాయిలో ఇంత దారుణం జరుగుతుంటే మద్యం నుంచి ప్రజలను విముక్తులను చేస్తున్నామని జగన్ జీసస్ మాటలు చెబుతుండడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్న సామెతను గుర్తుచేస్తోంది. మాట తప్పడం, మడమ తిప్పడం అంటే బహుశా ఇదే కాబోలు.