కంచే చేను మేస్తే.. కన్న తండ్రిలాగా చూసుకోవాల్సిన వాడే కాటు వేస్తే ఏముంటుంది. కంటిని కాపాడాల్సిన కంటిపాపే కన్ను పోగొడుతోంది. అనుబంధాలకు కాలం చెల్లిందనే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అభం శుభం తెలియని బాలికను లైంగికంగా లోబరుచుకుని కోర్కెలు తీర్చుకుంటూ నిత్యం వేధింపులకు గురిచేయడం పరిపాటే. కాపాడాల్సిన తల్లి కూడా అతడికి వంత పాడింది. దీంతో చివరికి తమ్ముడు చూసి చలించిపోయాడు. స్థానిక సచివాలయ సిబ్బందికి తెలియజేశాడు.
దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన ఓ మహిళ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో సమీప బంధువైన ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే పిల్లలకు తండ్రి అని నమ్మించింది. దీంతో పిల్లలను తండ్రిలా భావించాల్సిన అతడు వక్రబుద్ధితో చూశాడు. ఆమె 14 ఏళ్ల కూతురిపై కన్నేశాడు. బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. గత ఆరు నెలలుగా తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు.
అమ్మా నాన్న ఇలా చేస్తున్నాడని ఆ బాలిక తల్లితో చెప్పుకున్నా పట్టించుకోలేదు. దీంతో ఆ కీచకుడి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఈనేపథ్యంలో తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రతి రోజు నరకం చూపించడం మొదలు పెట్టాడు. ఆ చిన్నారికి అనారోగ్యం కలగడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించి తీసుకొచ్చారు. బాలిక అనారోగ్యంతో ఉన్నా తన కోరిక తీర్చాలని లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలికపై జరిగిన దారుణాన్ని కళ్లారా చూసిన తమ్ముడు జరిగిన విషయాన్ని స్థానిక వార్డు సచివాలయంలోని మహిళా కార్యదర్శికి చెప్పాడు. దీంతో వారు బాలిక నివాసానికి వెళ్లి విచారించారు. ఆ మృగాడు చుట్టుపక్కల వారిని కూడా లైంగిక వేధింపులకు గురిచేసేవాడని విచారణల వెల్లడైంది. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Step father seually harassing minor girl in nellore district
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com