విశాఖలో జగన్ సర్కార్ పంజా..టీడీపీ నేతల ఆక్రమణలపై ఉక్కుపాదం

ఏపీలో ప్రతీకార రాజకీయాలు షురువైనట్లేనా..? అధికారంలో ఉండగా ఎగిరెగిరి లేచిన టీడీపీ లీడర్లను ఇప్పుడు వైసీపీ టార్గెట్‌ చేసిందా..? ప్రధానంగా ఆ లీడర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలని చూస్తోందా..? ఇప్పుడు జరుగుతున్న పరిణామలన్నింటినీ చూస్తుంటే అవుననే సమాధానం ఇవ్వక తప్పదు. విశాఖ వేదికగా ఈ ప్రతీకార పంథం నడుస్తున్నట్లుగా అర్థమవుతోంది. Also Read: వైసీపీలో అసమ్మతి.. అనూహ్య పరిణామం టీడీపీ నేతలు అధికారంలో ఉండగా.. ఎక్కడెక్కడైతే అక్రమంగా భూములు తీసుకున్నారో.. ఎక్కడెక్కడ అక్రమంగా కట్టడాలు కట్టారో ఇప్పుడు […]

Written By: NARESH, Updated On : November 16, 2020 3:35 pm
Follow us on

ఏపీలో ప్రతీకార రాజకీయాలు షురువైనట్లేనా..? అధికారంలో ఉండగా ఎగిరెగిరి లేచిన టీడీపీ లీడర్లను ఇప్పుడు వైసీపీ టార్గెట్‌ చేసిందా..? ప్రధానంగా ఆ లీడర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలని చూస్తోందా..? ఇప్పుడు జరుగుతున్న పరిణామలన్నింటినీ చూస్తుంటే అవుననే సమాధానం ఇవ్వక తప్పదు. విశాఖ వేదికగా ఈ ప్రతీకార పంథం నడుస్తున్నట్లుగా అర్థమవుతోంది.

Also Read: వైసీపీలో అసమ్మతి.. అనూహ్య పరిణామం

టీడీపీ నేతలు అధికారంలో ఉండగా.. ఎక్కడెక్కడైతే అక్రమంగా భూములు తీసుకున్నారో.. ఎక్కడెక్కడ అక్రమంగా కట్టడాలు కట్టారో ఇప్పుడు వాటి బదులు తీర్చే పనిలో పడ్డారు అధికారులు. బుల్డోజర్లు ఇతర సామగ్రితో విశాఖ వైపు దూసుకెళ్తున్నారు. నోటీసులు గట్రా ఏమీ లేకుండానే కూల్చివేతలు మొదలుపెట్టేశారు. లీజు అక్రమం అంటూ ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్‌ను ఖాళీ చేయిస్తున్న సమయంలోనే అధికారులు మాజీ మంత్రి గంటాకు చెందిన భూమిని కూడా స్వాధీనం చేసుకున్నారు. విజయరాంపురం అనే గ్రామంలో 4.8 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రత్యూష అసోసియేట్స్‌ పేరిట కొనుగోలు చేశారు. గంటా భూమి కొనుగోలు చేసిన సర్వే నెంబర్‌లో ఇనామ్ భూమి ఉంది. దీంతో గంటా భూమి కూడా ఆక్రమణే అంటూ హుటాహుటిన అక్కడ ఉన్న గేట్లు ఇతరాలను తొలగించారు. ప్రభుత్వ స్థలం అని బోర్డులు పెట్టేశారు.

Also Read: ఏపీ పొలిటికల్ సీక్రెట్: ఆ మంత్రి షాడోదే పెత్తనమట?

అయితే.. గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి రాకముందు విశాఖలో సెటిలర్స్‌. ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆ భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అప్పట్లో ఎలాంటి వివాదాలు లేవని.. ఇప్పుడు కొత్తగా వివాదాలు తెస్తున్నారని ఆయన అంటున్నారు. కోర్టుకెళ్లి కూడా ఉత్తర్వులు తెచ్చుకున్నానని ఆయన అంటున్నారు. బ్యాంకులు కూడా ఈ భూమిని తనఖా పెట్టుకుని రుణం ఇచ్చాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఇదిలా ఉంటే.. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారని కొద్ది కాలంగా ప్రచారం నడుస్తోంది. రెండు, మూడు సార్లు ముహూర్తం కూడా ఖరారైంది. కానీ.. ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. ఆయన రాకను మంత్రి అవంతి, విజయసాయిరెడ్డి అడ్డుకుంటున్నారని వైసీపీలో ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆయన సజ్జల ద్వారా వైసీపీలో చేరడానికి రూట్ క్లియర్ చేసుకున్నారని కూడా అనుకున్నారు. ఈ కారణంగా టీడీపీ కూడా ఆయనకు ఎలాంటి పార్టీ పదవులు కల్పించలేదు. ఆయనను పట్టించుకోవడమే మానేశారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడే గంటాకు చెందిన కొన్ని ఆస్తులను కూల్చేస్తారని చెప్పుకున్నారు. రాత్రికి రాత్రి ఆయన స్టే తెచ్చుకుని కాపాడుకున్నారు. ఆ తర్వాత సైలెంటయ్యారు. మళ్లీ ఇప్పుడు హడావుడి చేయడం చూస్తుంటే.. తెరవెనుక వైసీపీ కీలక లీడర్‌‌ సఫలీకృతమయ్యారన్న చర్చ జరుగుతోంది.