నందమూరి నటసింహం బాలకృష్ణ కరోనాను టార్గెట్ చేసినట్లు కన్పిస్తోంది. ‘సెహరి’ సినిమా ఫస్టు లుక్ విడుదల కోసం నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కరోనాకు వ్యాక్సిన్ రాదని.. దానితో మనం ట్రావెల్ చేయాల్సిందేననే బాలయ్య ఖరాఖండిగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: రియల్ హీరో సోనుసూద్ సాయం వెనుక ఉందెవరు?
కార్తీక మాసం మొదలుకావడం చాలా ఛానెళ్లలో అధ్యాత్మికతను రోట్లో వేసి దంచుతున్నాయని తెలిపారు. ఉదయాన్ని లేచి తలస్నానం చేయాలని చెబుతున్నాయన్నారు. దీనిపై బాలయ్య తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కార్తీకమాసంలో ఎవరూ కూడా ఉదయాన్నేలేచి చన్నీళ్లతో స్నానం చేయొద్దని సూచించారు.
వేడినీళ్లతో స్నానం చేయడంతోపాటు.. వేడినీళ్లను ఆవిరి పట్టాలని.. ఉప్పు నీరు లేదా వేడినీళ్లతో పుక్కిలించాలని సూచించారు. కరోనా మనుషుల మనసులను కన్ఫ్యూజ్ చేస్తుందన్నారు. కరోనా అన్నది నుమోనియాకు సంబంధించిదని.. అదొక లిపిడ్ ప్రొటీన్ అని తెలిపారు. అది పరివర్తనం చెందుతూ ఉంటుందని అందుకే ఇప్పటివరకు దానికి వ్యాక్సిన్ రాలేదన్నాడు. ఇకపై రాదని కచ్చితంగా చెబుతున్నానని బాలయ్య సంచలన కామెంట్స్ చేశారు.
Also Read: థియేటర్లు ఓపెన్ అయినా కన్పించని సందడి..ఇప్పుడేలా?
కరోనా సమయంలో ధైర్యంగా షూటింగ్ చేస్తున్న ‘సెహరి’ టీమ్‌ను బాలకృష్ణ అభినందించారు. కార్తీక సోమవారం రోజున ఈ మూవీ ఫస్టు లుక్ విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. తన స్నేహితుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
హీరో హర్ష కనుమిల్లి.. దర్శకుడు జ్ఞానసాగర్ లకు ఈ సినిమా విజయాన్ని అందించాలని ఆకాంక్ష వెలిబుచ్చుతూ చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక మధ్యమధ్యలో బాలయ్య మార్క్ కామెడీ.. పద్యాలతో అభిమానులను అలరించారు. కరోనాపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.