వలస కూలీలను కోర్టు ఎలా అడ్డుకుంటుంది?:సుప్రీం

వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించాలని వచ్చిన ఒక పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వలస కూలీలను నడవకుండా కోర్టు ఎలా ఆపుతుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. రైలు పట్టాలపై నిద్రించేవారిని ఎవరు రక్షిస్తారని కూడా కోర్టు ప్రశ్నించింది. లాక్‌ డౌన్‌ వల్ల పనులు కోల్పోయి, రవాణా లేకపోవడంతో సొంత రాష్ట్రాలకు నడిచి వెళ్తున్న వలస కూలీలను ఆపలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఎవరు నడిచి వెళ్తున్నారు, ఎవరు వెళ్లడం లేదనే విషయం సమీక్షించడం కోర్టుకు […]

Written By: Neelambaram, Updated On : May 15, 2020 7:32 pm
Follow us on

వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించాలని వచ్చిన ఒక పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వలస కూలీలను నడవకుండా కోర్టు ఎలా ఆపుతుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. రైలు పట్టాలపై నిద్రించేవారిని ఎవరు రక్షిస్తారని కూడా కోర్టు ప్రశ్నించింది. లాక్‌ డౌన్‌ వల్ల పనులు కోల్పోయి, రవాణా లేకపోవడంతో సొంత రాష్ట్రాలకు నడిచి వెళ్తున్న వలస కూలీలను ఆపలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఎవరు నడిచి వెళ్తున్నారు, ఎవరు వెళ్లడం లేదనే విషయం సమీక్షించడం కోర్టుకు కుదరని పని అని జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర రావుతో కూడిన బెంచ్‌ స్పష్టం చేసింది.

వలస కూలీలకు సంబందించి వచ్చిన ఒక పిటిషన్ పై కోర్టు విచారించింది. వలస కూలీల అంశంలో రాష్ట్రాలే స్పందించాలని, నడుచుకుంటూ వెళ్లేవారు ఆగడం లేదని, వారిని తాము ఎలా ఆపగలం అని కోర్టు వ్యాఖ్యానించింది. రైల్వే ట్రాక్‌ పై నిద్రించే వారిని ఎవరు రక్షిస్తారని మహారాష్ట్ర ప్రమాదంలో కోర్టు అభిప్రాయపడింది.