రైతుల మద్దతు ధర కోసం కొత్త చట్టం!

దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చేలా, మద్దతు ధర కోసం వారు పడే కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రైతుల కోసం కేంద్రం కొత్తగా ఓ చట్టం తీసుకురానుంది. ఈ చట్టం వల్ల రైతులు తాము పండించిన పంటను ఏ రాష్ట్రంలో అయినా అమ్ముకోవచ్చు. ఇప్పటికి వరకు ఆ వెసులుబాటు లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పొరుగు రాష్ట్రంలో ఎక్కువ ధర లభిస్తుందంటే అక్కడకు తీసుకుని వెళ్లి విక్రయించవచ్చు. అలాగే, ఈ- ట్రేడింగ్ ఆఫీస్‌ ను […]

Written By: Neelambaram, Updated On : May 15, 2020 7:13 pm
Follow us on

దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చేలా, మద్దతు ధర కోసం వారు పడే కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రైతుల కోసం కేంద్రం కొత్తగా ఓ చట్టం తీసుకురానుంది. ఈ చట్టం వల్ల రైతులు తాము పండించిన పంటను ఏ రాష్ట్రంలో అయినా అమ్ముకోవచ్చు. ఇప్పటికి వరకు ఆ వెసులుబాటు లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పొరుగు రాష్ట్రంలో ఎక్కువ ధర లభిస్తుందంటే అక్కడకు తీసుకుని వెళ్లి విక్రయించవచ్చు. అలాగే, ఈ- ట్రేడింగ్ ఆఫీస్‌ ను కూడా ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సంస్కరణలను ప్రకటించారు.

వంట నూనెలు, నూనె గింజలు, పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు చట్టం బయటకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఆహార శుద్ధి విభాగంలోని పరిశ్రమలకు సరకు నిల్వ పరిమితి నుంచి మినహాయింపులు ఇస్తామని… ఈ  మేరకు నిత్యవసరాల చట్టానికి సవరణలు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని నిర్మల చెప్పారు. భారీగా పెట్టుబడులు ఆకర్షించి, వ్యవసాయ రంగంలో పోటీ పెంచేందుకు ఇది అవసరమని మంత్రి చెప్పారు. అలాగే ప్రతి సీజన్‌‌కు ముందు విత్తనాలు నాటే ముందే రైతులకు ఈ సంవత్సరం ఏ పంట ఎంత అవసరం అవుతుంది? దానికి మద్దతు ధర ఎంత ఉంటుంది? ఎంత ఉత్పత్తి సరిపోతుందనే వివరాలను లీగల్‌గా తెలియజేయనున్నారు.

నిత్యావసర సరుకుల చట్టం 1955లో సవరణలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. హోల్ సేల్ వ్యాపారులు, ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల వారి వద్ద ఎక్కువ మొత్తంలో ఆయిల్స్ నిల్వ ఉన్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన జాబితాలోని వస్తువులకు ఎలాంటి స్టాక్ లిమిట్స్ ఉండవు. అత్యవసర సమయంలో మాత్రమే షరతులు వారికి వర్తిస్తాయి