కర్నూల్ లో మరో పిడుగులాంటి వార్త!

ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు తర్వాత కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యే జిల్లా కర్నూల్. అయితే ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త కర్నూల్ ని మరింతగా భయపెడుతుంది. పాణ్యం కేసు తర్వాత మరో పాజిటివ్‌ మరణం ఇప్పుడు జిల్లా యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. ఒక అల్లోపతి వైద్యుడు కరోనా సోకి మరణించాడు. ఈ నెల 14న కోవిడ్‌-19 వైరస్‌ సోకి ఆ అల్లోపతి వైద్యుడు మృతిచెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఆయన అనారోగ్యం బారిన పడక మునుపు […]

Written By: Neelambaram, Updated On : April 16, 2020 10:54 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు తర్వాత కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యే జిల్లా కర్నూల్. అయితే ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త కర్నూల్ ని మరింతగా భయపెడుతుంది. పాణ్యం కేసు తర్వాత మరో పాజిటివ్‌ మరణం ఇప్పుడు జిల్లా యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. ఒక అల్లోపతి వైద్యుడు కరోనా సోకి మరణించాడు.
ఈ నెల 14న కోవిడ్‌-19 వైరస్‌ సోకి ఆ అల్లోపతి వైద్యుడు మృతిచెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఆయన అనారోగ్యం బారిన పడక మునుపు వందలాది మందికి వైద్య సేవలు అందించారు. పలువురు సిబ్బందితో కలిసి పని చేశారు. ఆయనతో కాంటాక్ట్‌ అయిన వారి జాబితా కోసం ప్రయత్నించిన అధికారుల చేతికి ఇప్పటికే 1,150 మంది పేర్లు వచ్చాయని తెలిసింది. థర్డ్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ కింద వేలాది మంది ఉన్నారన్న వార్త అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది.

ఇప్పటికే 115 పాజిటివ్‌ కేసులతో కర్నూలు జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది. రెండో పాజిటివ్‌ మరణం వివరాలను జిల్లా అధికారులు బహిర్గతం చేయడం లేదు. ఆ వ్యక్తి మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారన్న వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఖననం చేసేందుకు మృతదేహాన్ని తీసుకువెళుతున్న ఫొటోలు, వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో అప్‌ లోడ్‌ చేశారు. ఆ వైద్యుడు కరోనాతోనే మృతిచెందినట్లు కలెక్టర్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, కాంటాక్ట్‌ అయిన కొందరు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నారు. ఆ వ్యక్తి వద్ద పనిచేసిన వర్కర్లను బుధవారపేట నుంచి పరీక్షల నిమిత్తం మంగళవారం రాత్రి అధికారులు తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. వర్కర్లు, పరిచయస్తుల నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపిస్తే కేసులు వేలల్లో ఉంటాయన్న భయం వెంటాడుతోంది. ఈ వ్యవహారం జిల్లా అధికార యంత్రాంగానికి నిద్రలేకుండా చేస్తోంది. పరిస్థితి చేయి దాటక ముందే అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌లను ఐసొలేషన్‌కు తరలించాలని, కాంటాక్ట్‌ అయినవారి వివరాలను సేకరించాలని కలెక్టర్‌ నుంచి ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

అసలు జరిగింది ఇది!

కర్నూలు నగరంలోని ఎన్ ‌ఆర్‌ పేటకు చెందిన అల్లోపతి వైద్యుడు కరోనా లక్షణాలతో ఈ నెల 13న కర్నూలు జీజీహెచ్‌లో చేరారు. పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు ఆ వ్యక్తిని ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. కరోనా నిర్ధారణ కోసం నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్‌కు పంపించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయారు. దీంతో మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. రెండు రోజుల క్రితమే ఆ వైద్యుడి కరోనా రిపోర్టులు కర్నూలు వైద్య శాఖకు అందాయి. కరోనా నెగిటివ్‌ వచ్చిందని కొందరు వైద్యులు చెబుతూవచ్చారు.