DMK Support To Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఐదు రోజులపాటు రాజకీయ నాటకీయత కొనసాగింది. మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధిపతి విజయ్‌కు తెలిపారు. ఈమేరకు విజయ్ మద్దతు కూడగట్టేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ భేషరతుగా మద్దతు తెలిపింది. తర్వాత సీపీఐ కూడా మద్దతుకు ఇచ్చింది. దీంతో విజయ్ బలం 116కు చేరింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరమైన తరుణంలో వీసీకే మద్దతుపై ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో కాస్త ఆలస్యంగా వీసీకే కూడా విజయ్ పార్టీకి మద్దతుగా లేఖ ఇచ్చింది. దీంత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.
స్టాలిన్ చొరవతోనే..
మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చొరవే ముఖ్య కారణమని పార్టీ నాయకులు ప్రకటించారు. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు సమకూర్చడంలో స్టాలిన్ మిత్రపక్షాలపై ప్రభావం వ్యాపించడం గమనార్హం. టీవీకే పార్టీ 107 స్థానాలు సాధించి అతిపెద్ద శక్తిగా నిలిచినప్పటికీ, 118 మెజారిటీ గుర్తు దాటడానికి మిత్రపక్షాల సహాయం తప్పనిసరి అయింది. మూడు రోజుల సస్పెన్స్‌లో కాంగ్రెస్ (5 సీట్లు), సీపీఐ, సీపీఎం (ఇద్దరుగా) మద్దతు ప్రకటించి సంఖ్యాబలం 116కు చేరింది. తర్వాత వీసీకే, ఐయూఎంఎల్ (ఇద్దరుగా) చేరడంతో 120కి చేరి గండం తప్పింది.
మిత్రపక్షాలకు ఫ్రీహ్యాండ్..
ఈ ప్రక్రియలో స్టాలిన్ మిత్రపక్షాలకు ’ఫ్రీ హ్యాండ్’ ఇచ్చి, విజయ్‌కు మార్గం సుగమం చేశారు. డీఎంకే ప్రతినిధి ఎ.శరవణన్ ఈ విషయాన్ని స్పష్టం చేశాఉ. ‘రాజ్యాంగ సంక్షోభం నివారించాలనే స్టాలిన్ కోరికపైనే ఈ మద్దతు‘ వచ్చింది. ఇది తమిళ రాజకీయాల్లో స్థిరత్వానికి స్ట్రాటజిక్ చర్యగా కనిపిస్తోంది.
స్టాలిన్ వ్యూహం..
స్టాలిన్ చొరవ డీఎంకే మిత్రపక్షాలను ఏకకాలంలో విజయ్ వైపు మళ్లించింది. వీసీకే, వామపక్షాలు మద్దతు ప్రకటించడం వెనుక ఆయన సమావేశాలు కీలకం. అయితే, కాంగ్రెస్‌పై డీఎంకే నేతలు గుర్రుగా ఉన్నారు. ‘మా కార్యకర్తల శ్రమతోనే వారికి 5 సీట్లు దక్కాయి, కానీ కృతజ్ఞతలు లేవు‘ అని శరవణన్ ఆరోపించారు. అయితే ఈ డెవలప్‌మెంట్ స్టాలిన్ రాజకీయ ఎత్తుగడను చూపిస్తుంది. ఓటమి ఎదుర్కొన్న డీఎంకే, విజయ్ ప్రభుత్వాన్ని స్థిరపరచి భవిష్యత్ కూటములకు మార్గం తీర్చుకుంది.
విజయ్ టీవీకే అధికారంలోకి రావడం తమిళనాడులో నూతన యుగానికి సూచిక. స్టాలిన్ చొరవ రాష్ట్రంలో స్థిరత్వాన్ని నెలకొల్పుతూ, డీఎంకే భవిష్యత్ ఎన్నికల్లో పునరుద్ధరణకు ఆధారం వేస్తోంది. ఇది పార్టీల మధ్య అనుకూల సంబంధాలు, ప్రత్యర్థులపై రాజకీయ ఒత్తిడి ఎలా పనిచేస్తాయో చూపుతుంది.