https://oktelugu.com/

Kashmir: ముత్యంలా మెరిసిపోతున్న కాశ్మీర్.. అందాలు చూడు తరమా

మన దేశంలో కశ్మీర్‌ అందానికి పెట్టింది పేరు. లోయలు, సరస్సులు, పచ్చని అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక ఏడాదిలో ఆరు నెలలు ఇక్కడ మంచు కురుస్తుంది. మంచుతో కాశ్మీర్‌కు మరింత అందం వస్తుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 21, 2024 / 03:18 PM IST

    Kashmir

    Follow us on

    Kashmir: భారత దేశానికి శిరస్సులాంటిది కశ్మీర్‌. దాయాది దేశం పాకిస్తాన్‌ కారణంగా అలసడి ఉన్నా.. కశ్మీర్‌ అందాలకు కొదవ లేదు. అందుకే కాశ్మీర్‌పై కవులు అనేక పాటలు శారారు. ఇక అనేక సినిమా షూటింగ్‌లు కశ్మీర్‌లో జరిగాయి. ఇందుకు కారణం అక్కడి ప్రకృతి అందాలే. ప్రస్తుతం శీతాకాలం నేపథ్యంలో కశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా కన్నా తక్కువగా నమోదువుతున్నాయి. రాబోయే రోజుల్లో చలి మరింతగా పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

    మైనస్‌ ఉష్ణోగ్రతలు..
    శ్రీనగర్‌లో గురువారం(నవంబర్‌ 21న) కనిష్ట ఉష్ణోగ్రతలు – 0.4 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైంది. నవంబర్‌ 23 వరకు కశ్మీర్‌లో వాతావరణం సాధారణంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్‌ 24న మార్పులు జరుగుతాయని తెలిపింది. లోయలోని ఎత్తయిన ప్రాంతాల్లో తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కశ్మీర్‌లోని ఖాజిగుండ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు – 2.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పహల్గామ్‌లో – 3.2 డి్ర‘గీలుగా నమోదైంది. షోపియాన్‌లో – 3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక గుల్మార్‌లో 0.0గా, కుప్వారాలో – 0.9 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోకర్నాగ్‌లో 0.7గా, బందిపొరాలో – 2.4గా, బారాముల్లాలో – 0.4 డిగ్రీల సెల్సియస్‌గా, బుద్దామ్‌లో 2.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుల్గామ్‌లో – 2.6, లారున్‌లో – 3.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

    ఎంజాయ్‌ చేస్తున్న స్థానికులు..
    ఇదిలా ఉంటే.. వాతావరణ మార్పులను కశ్మీరీలు ఎంజాయ్‌ చేస్తున్నారు. తెల్లగా పరుచుకున్న మంచులో ఆటలాడుతున్నారు. గెంతులు వేస్తున్నారు. ఇక ఇప్పటికే అక్కడ ఉన్న పర్యాటకులు కశ్మీర్‌ అందాలను మంచులో చూసి మురిసిపోతున్నారు. ఇక కశ్మీర్‌లో మంచు కురుస్తున్న విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రేమికులు కశ్మీర్‌ బాట పడుతున్నారు.