https://oktelugu.com/

Anchor Anasuya : రాత్రి దారుణమైన మెసేజ్ లు చేస్తూ అనసూయను ఇబ్బంది పెడుతున్న వ్యక్తి… అసలు ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంటుంది రంగమ్మత్త. అంతేకాదు ట్రోల్ కి కూడా గురి అవుతుంటుంది. ఆ మద్య విజయ్ దేవరకొండ ఫ్యాన్ కోపానికి గురైంది. అయినా నిత్యం వార్తల్లో నిలవడం అమ్మడుకు కామన్ కావచ్చు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 21, 2024 / 03:17 PM IST

    Anchor Anasuya

    Follow us on

    Anchor Anasuya : తెలుగు బుల్లితెర మీద యాంకర్ అనసూయ గురించి తెలియని వారు ఉండరు. ఈమె గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు జబర్దస్త్ ద్వారానే ఫుల్ ఫేమ్ వచ్చింది. ఈ షో ద్వారా చాలా పాపులర్ అయింది ఈ యాంకర్. అయిత అతి తక్కువ సమయంలోనే సినిమాలలో పలు కీలకమైన పాత్రలలో నటించింది. దీంతో ఏకంగా  భారీ పాపులారిటీ సంపాదించుకుంది. కొన్ని సందర్భాలలో అనసూయ జడ్జిగా కూడా వ్యవహరించింది అంటే ఆమె పాపులారిటీ గురించి అర్థం చేసుకోవచ్చు.

    యాంకరింగ్ గురించి పక్కన పెడితే ఈమెకు సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం ఉండటంతో యాంకరింగ్  కు ఫుల్ స్టాప్ పెట్టి సినిమాల్లోనే ఎక్కువగా కనిపించాలి అనుకుంది. రంగస్థలం సినిమాలో తన పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు అత్తగా నటించి తన సత్తా చాటింది అనసూయ. ఈ ఒక్క సినిమా ద్వారా ఎక్కడ లేని క్రేజ్ ను సంపాదించింది అనసూయ. ఇక ఆమెకు వరుస సినిమా ఆఫర్లు రావడంతో ఆ రంగంలోనే ఫుల్ గా జోష్ పెంచేసుకుంది.. వరుస ఆఫర్లతో ప్రస్తుతం బిజీ నటిగా పేరు సంపాదించింది ఈ యాంకర్. కొన్ని పాత్రలకు ఈమె తప్ప మరెవరు సూట్  కారు అనే రేంజ్ లో ముద్ర వేసుకుంది.

    సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంటుంది రంగమ్మత్త. అంతేకాదు ట్రోల్ కి కూడా గురి అవుతుంటుంది. ఆ మద్య విజయ్ దేవరకొండ ఫ్యాన్ కోపానికి గురైంది. అయినా నిత్యం వార్తల్లో నిలవడం అమ్మడుకు కామన్ కావచ్చు. అందుకే ఈ సారి మరో టాపిక్ తో వార్తల్లో నిలుస్తుంది. ఈ రంగమ్మత్తను ఒక వ్యక్తి ఫోన్ చేసి తరచూ రాత్రిపూట ఇబ్బంది పెడుతున్నారు అని టాక్. అంతేకాదు తన రేట్ కూడా అడుగుతున్నాడని సమాచారం. దీంతో అనసూయ కు కోపం, విసుగు వచ్చి ఆ వ్యక్తిని బ్లాక్ లో పెట్టిందట. అంతేకాదు మరో నెంబర్ నుంచి మరీ ఫోన్ చేసి మెసేజ్ లు చేస్తూ విసిగిస్తున్నాడట.

    ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పుకుంటూ బాధ పడిందట అనసూయ. ఈ విషయంలో నిజం ఎంత వరకు ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషించిన రంగమ్మత్త పుష్ప 2లో కూడా కీలకమైన పాత్రలో నటిస్తోంది. రీసెంట్ గా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. అదే రేంజ్ లో సోషల్ మీడియాలో తన క్రేజ్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడుతున్న హీరోయిన్ లకు ధీటుగా నటిస్తూ తన సత్తా చాటుతుంది ఈ ముద్దుగుమ్మ.