నేత్రపర్వంగా ఎదుర్కోలు ఉత్సవం

Sri Ramanavami – Badrachalam : దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీరామనవమి శోభను సంతరించుకుంది. ఎటు చూసినా స్వాగత ద్వారాలు…చలువ పందిళ్లు, చాందినీ వస్త్ర అలంకరణలతో రామాలయ ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది.

గురువారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి వైకుంఠ ద్వారం వద్ద సీతారామచంద్రస్వామి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

గురువార కల్యాణం నిర్వహిం చనున్న నేపథ్యంలో రామాలయానికి విద్యుత్తు దీపాలంకరణలు, వెదురు పందిళ్లు, చాందినీ వస్త్రాలంకరణలు, భద్రాద్రి రహదారులపై ఎటు చూసినా బాపు రమణీయ దృశ్యాల చిత్రాలు భక్తులకు కన్నుల విందు చేస్తున్నాయి.

స్వాగత ద్వారాలు, భక్తరామదాసు కీర్తనలు ఇలా పూర్తిగా భద్రాద్రి కాస్త భక్తాద్రిగా మారిపోయింది.

కల్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రామయ్య సన్నిధికి చేరుకుంటున్నారు.
