Sri Rama Kalyanam In Bhadradri: సీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాచలం రాములోరి గుడి పూజారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించారు. గవర్నర్ తమిళిసై హాజరు కానున్నారు. అభిజిత్ లగ్న పుష్కరాంశమున సీతా రాములు జంట కానున్నారు. ఈ వేడుక తిలకించేందుకు భక్తులు అశేషంగా తరలి వస్తున్నారు. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో భక్తులను అనుమతించకపోవడంతో ఈసారి భక్తజనసంద్రంగా మారింది.
మధ్యాహ్నం సమయంలో కల్యాణ ఘట్టం నిర్వహించనున్నారు. అర్చకులు స్వాముల తల మీద జీకర్ర బెల్లం ఉంచి కల్యాణం చేయనున్నారు. మిథిల స్టేడియం ఎదురుగా ఉన్న ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ర్ట ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు.
Also Read: Current cuts: కరెంట్ కోతలైనా.. మరేదైనా.. వైసీపీది ఒకటే దారి..!
శ్రీరాముల వారి పట్టాభిషేకం కన్నుల పండువగా సాగుతోంది. వేసవి కాలం కావడంతో మిథిల మైదానంలో కూలర్లు, ఫ్యాన్లు అమర్చారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. రెండు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో భద్రాచలంలోని రాములోరి గుడి వద్ద భక్తజన సందోహం పెరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భద్రాచలం భక్తులతో నిండిపోయింది. దాదాపు 400 ఆర్టీసీ బస్సులు వివిధ ప్రాంతాల నుంచి చేరుకుంటున్నాయి. భక్తులను చేరవేస్తున్నాయి. దీంతో ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. స్వామి వారి మంత్రాలే వినిపిస్తున్నాయి. పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరుగుతోంది. యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు నిర్వహించి భక్తుల కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. దీంతో భక్తులు స్వామి వారి సేవలో తరిస్తున్నారు.
Also Read:CM Jagan: క్యాబినెట్ ప్రక్షాళనతో జగన్.. ఆ ముఖ్యమంత్రుల సరసన చేరనున్నారా?