Taliban: అప్ఘన్ లో తాలిబన్లు అడుగుపెట్టడానికి సాహసించని ప్రాంతం ఇదే

అప్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశమైంది. కానీ అప్ఘన్ లోని ఆ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ తాలిబన్లు అడుగు పెట్టలేదు. అడుగు పెట్టడానికి కూడా సాహసించడం లేదు. ఎందుకంటే అక్కడున్నది అరవీర భయంకరులు.. తాలిబన్లకే ఉచ్చ పోయించే ధీరాధి దీరులు. ఆ ప్రాంతం నేత పేరు చెబితేనే తాలిబన్లు వణికిపోతారు.. తాలిబన్లకు సింహ స్వప్నం అయిన అహ్మద్ షా మసూల్ ఉన్న ప్రాంతంలో ఇప్పటికీ తాలిబన్లు అడుగుజాడలు లేవు. తాలిబన్లు అడుగుపెట్టడానికే సాహసించని అప్ఘనిస్తాన్ లోని ఆ ప్రాంతం […]

Written By: NARESH, Updated On : August 19, 2021 7:57 pm
Follow us on

అప్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశమైంది. కానీ అప్ఘన్ లోని ఆ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ తాలిబన్లు అడుగు పెట్టలేదు. అడుగు పెట్టడానికి కూడా సాహసించడం లేదు. ఎందుకంటే అక్కడున్నది అరవీర భయంకరులు.. తాలిబన్లకే ఉచ్చ పోయించే ధీరాధి దీరులు. ఆ ప్రాంతం నేత పేరు చెబితేనే తాలిబన్లు వణికిపోతారు.. తాలిబన్లకు సింహ స్వప్నం అయిన అహ్మద్ షా మసూల్ ఉన్న ప్రాంతంలో ఇప్పటికీ తాలిబన్లు అడుగుజాడలు లేవు. తాలిబన్లు అడుగుపెట్టడానికే సాహసించని అప్ఘనిస్తాన్ లోని ఆ ప్రాంతం పేరే ‘పంజ్ షీర్’.. అప్ఘన్ లు అంతా తాలిబన్లకు చావుభయంతో పారిపోతుంటే..  ఆ దేశంలోని ఉండి స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తున్న ఆ ప్రాంతం గురించి.. అక్కడి నాయకుడు అహ్మద్ షా మసూద్ గురించి ప్రత్యేక కథనం..

అఫ్గనిస్తాన్ లో తాలిబన్ల పాలన సాగుతున్న నేపథ్యంలో ఒక ప్రాంతం మాత్రం వారి ఆధీనంలోకి రాలేదు. దీంతో విజయగర్వంతో ఊగిపోతున్న తాలిబన్లకు పెద్ద షాక్ తగిలినట్లే. ఇరవయ్యేళ్లకు పైగా విశ్వ ప్రయత్నాలు చేసినా కనీసం ఆ ప్రాంతాన్ని తాకడానికి కూడా తాలిబన్లకు ధైర్యం చాలడం లేదు. దీంతో ఆ ప్రాంతం వారి చేతుల్లోకి వెళ్లకుండా ప్రశాంతంగా ఉంటోంది. అదే పంజ్ షిర్. ఈ ప్రాంతానికి అహ్మద్ షా మసూద్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన పేరు చెబితే చాలు తాలిబన్లల వణుకు పుడుతుంది. అంతటి సింహస్వప్నంలా వ్యవహరించిన ఆయన సాహసమే ఆ ప్రాంతానికి రక్షణగా ఉంటోంది.

రాజకీయ వ్యూహాలకు కూడా పంజ్ షిర్ కేంద్ర బిందువుగా మారింది. అసలు అహ్మద్ షా మసూద్ అంటే తాలిబన్లకు ఎందుకంత భయం అంటే ఆయన ఎవరికి లొంగరు. హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్ కు ఉత్తరాన 150 కి.మీ. దూరంలో పంజ్ షిర్ ప్రావిన్స్ ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే అధికంగా ఉంటారు. పంజ్ షిర్ అంటే సంస్కృతంలో ఐదు సింహాలు అని అర్థం. ఈ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే 11వ శతాబ్దపు చరిత్ర ఆనవాళ్లు తెలుసుకోవాల్సిందే.

అప్పట్లో ఈ ప్రాంతానికి వచ్చిన వరదలను అడ్డుకోవడానికి ఐదుగురు సోదరులు ప్రయత్నించారట. మహ్మద్ గజనీకి వారు ఓ ఆనకట్టను నిర్మించినట్లు చెబుతున్నారు. అహ్మద్ షా మసూద్ రాజకీయ నేతగా మాత్రమే కాదు మిలిటరీ కమాండర్. సోవియట్ యూనియన్ 1979-1989 దండయాత్రను శక్తివంతమైన గెరిల్లా కమాండర్ గా కూడా ప్రతిఘటించారు. 2001లో యూరప్ ను సందర్శించి తాలిబన్లకు పాకిస్తాన్ మద్దతు లేకుండా చేయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ నేతలను కోరారు.

తాలిబన్లు కాబుల్ ను కైవసం చేసుకున్న మరుక్షణమేఆ ధేశ అధ్యక్షుడిగా ఉన్న అష్రఫ్ ఘనీ ప్రాణభయంతో భారీగా డబ్బుతో యూఏఈకి పారిపోయాడు. ఆ దేశ తొలి ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్ మాత్రం తాలిబన్లకు తలవంచేది లేదని ధైర్యంగా ప్రకటించారు. ప్రస్తుతం దేశం లోపలే ఉన్నాయని ఆపద్ధర్మ దేశ అధ్యక్షుడిగా కూడా తానేనని ప్రకటించుకున్నారు. మరో వైపు అహ్మద్ మసూద్ కూడా తన తండ్రి మార్గంలోనే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.