గ్యాస్ లీకేజ్ నివారణకు ప్రత్యేక బృందం..!

విశాఖ వెంకటాపురం ఎల్.జి పాలిమర్స్ లో విష రసాయనం లీక్ అవడంతో పలువురు మృత్యువాత పడగా, వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విధితమే. ఈ సంఘటనపై ప్రధాని ఢిల్లీలోని తన కార్యాలయంలో గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలో విషవాయువు లీకేజీ కొనసాగుతున్న నేపథ్యంలో దీని నివారణకు ప్రత్యేక రసాయనాలు (కెమికల్) తీసుకుని ప్రత్యేక నిపుణుల బృందం( టెక్నీషియన్స్) ముంబై నుంచి పూణే, […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 10:15 am
Follow us on


విశాఖ వెంకటాపురం ఎల్.జి పాలిమర్స్ లో విష రసాయనం లీక్ అవడంతో పలువురు మృత్యువాత పడగా, వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విధితమే. ఈ సంఘటనపై ప్రధాని ఢిల్లీలోని తన కార్యాలయంలో గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలో విషవాయువు లీకేజీ కొనసాగుతున్న నేపథ్యంలో దీని నివారణకు ప్రత్యేక రసాయనాలు (కెమికల్) తీసుకుని ప్రత్యేక నిపుణుల బృందం( టెక్నీషియన్స్) ముంబై నుంచి పూణే, నాగపూర్ నుండి విశాఖ విమానాశ్రయానికి కార్గో విమానంలో రాత్రి చేరుకున్నారు. ఈ కెమికల్ తో త్వరితగతిన గ్యాస్ లీక్ ను అరికట్టవచ్చునని నిపుణులు తెలిపారు. ఈ బృందంలో 9 మంది సభ్యులు ఉన్నారు.

ఘోరం.. రైలు చక్రాలక్రింద నలిగిన కూలి బ్రతుకులు!

మరోవైపు విశాఖ ఎల్.జి పాలిమర్స్ కు సుమారు మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు. గురువారం అర్ధరాత్రి ఎల్.జి పాలిమర్స్ నుంచి విషవాయువు వెలువడటంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇళ్ళు విడిచి వాహనాలలో, నడుచుకుంటూ సింహాచలం ప్రాంతంవైపు తరలిపోతున్న ఘటన చోటు చేసుకుంది. చాలా మంది భయంతో రాత్రి నిద్ర లేకుండా గడిపారు. మరికొందరు ఇళ్ళు విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్లి రోడ్డు పక్కనున్న ప్లాట్ ఫామ్ లపై నిద్రకు ఉపక్రమించారు.