SP MP Rajeev Rai: విపరీత వాహనాలు.. 100 మీటర్లు ప్రయాణించడానికి గంటలు.. వాహనాల రాకపోకలను పర్యవేక్షించడానికి ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించడు. ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి వరకు ఇదే వరుస. అలాగని అదేమీ మామూలు నగరం కాదు. దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు సామాన్యులకే కాదు, ప్రజాప్రతినిధులకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఏకంగా పార్లమెంట్ లోనే ఏ కరువు పెట్టారు. సమాజ్ వాదీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ రాయ్ బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “దేశ ఐటీ రాజధానిగా బెంగళూరు నగరం ఎదుగుతోంది. కానీ ఆ స్థాయిలో అక్కడ సదుపాయాలు కల్పించడం లేదు. ట్రాఫిక్ అత్యంత దారుణంగా ఉంది. ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించడం లేదు. నేను పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడానికి బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లడానికి ప్రయాణమయ్యాను. విమానాశ్రయం వరకు వాహనంలోనే వచ్చాను. విమానాశ్రయం చేరుకోవడానికి గంటల తరబడి సమయం పట్టింది. పోలీసులను సంప్రదించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. చివరికి విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లాల్సి వచ్చిందని” రాజీవ్ రాయ్ పేర్కొన్నారు.
రాజీవ్ చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో బెంగళూరు నగరంలో మరోసారి ట్రాఫిక్ కష్టాలు చర్చకు వచ్చాయి. ఇటీవల బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలపై పలువురు ప్రముఖులు తమ అనుభవాలను వెల్లడించారు. ఇటీవల బెంగళూరు నగరంలో నిర్వహించిన కార్యక్రమానికి సుప్రసిద్ధ శాస్త్రవేత్త వచ్చారు. బెంగళూరు నగరంలో చెత్త, ట్రాఫిక్ సమస్య గురించి బయోకాన్ సిఎండి కిరణ్ మజుందార్ షా తో చర్చించారు. ఇదే విషయాన్ని బయోకాన్ సిఎండి బయట పెట్టడంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా కూడా బెంగళూరులో ట్రాఫిక్ పై స్పందించారు. బెంగళూరు నగరంలో రోడ్లమీద ప్రయాణించడం కంటే అంతరిక్షం వెళ్లడం ఉత్తమం అని ఆయన వ్యాఖ్యానించారు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యపై విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ స్పందించారు. పదివేల కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ రోడ్డు నెట్వర్క్ నిర్మిస్తామని.. ఇది ప్రతిపాదనలో ఉందని ఆయన పేర్కొన్నారు.
DK Shivakumar Hits Back AT SP MP Rajeev Rai’s Tweet About Bengaluru Traffic And Police#TV9Kannada #BengaluruBadRoads #BengaluruGarbage #BengaluruPotholes #BrandBengaluru #BengaluruTraffic #BengaluruRoads #KannadaNews pic.twitter.com/zml46iLVyt
— TV9 Kannada (@tv9kannada) December 1, 2025