ఎస్పీ బాలు ఆసుపత్రి బిల్లుపై వివాదం.. స్పందించిన ఎస్పీ చరణ్

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లులపై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. ఎస్పీ బాలు చనిపోయిన తర్వాత బిల్లుపై వివాదం జరిగిందని అందులో రాసుకొచ్చారు. బాలు చికిత్సకు దాదాపు 3 కోట్ల బిల్లును ఎంజీఎం ఆస్పత్రి వేసిందని.. తమిళనాడు ప్రభుత్వంను ఆశ్రయించగా.. ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని..  ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసినట్లు ప్రచారం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్య కూతురు చెల్లించిందని అప్పుడు మృతదేహాన్ని అప్పగించారని సోషల్ మీడియాలో […]

Written By: NARESH, Updated On : September 28, 2020 11:39 pm

sp

Follow us on

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లులపై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. ఎస్పీ బాలు చనిపోయిన తర్వాత బిల్లుపై వివాదం జరిగిందని అందులో రాసుకొచ్చారు. బాలు చికిత్సకు దాదాపు 3 కోట్ల బిల్లును ఎంజీఎం ఆస్పత్రి వేసిందని.. తమిళనాడు ప్రభుత్వంను ఆశ్రయించగా.. ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని..  ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసినట్లు ప్రచారం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్య కూతురు చెల్లించిందని అప్పుడు మృతదేహాన్ని అప్పగించారని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూతురు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

Also Read : రాహులే ప్రధాని.. దీపిక ప్రశంసలు.. అందుకే ఈ కష్టాలా?

ఎస్పి బాలు ఆసుపత్రి బిల్లులను తాము చెల్లించామనే ప్రచారంపై ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కుమార్తె  దీపా వెంకట్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్  అవుతున్న పుకార్లపై  దీపా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది,  ఎస్పీ బాలు ఆసుపత్రి బిల్లులు చెల్లించలేదని.. ఇలాంటి పుకార్లను ప్రచారం చేయవద్దని లేదా అలాంటి వాట్సాప్ ఫార్వార్డ్లను నమ్మవద్దని ప్రతి ఒక్కరినీ కోరారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స పొందిన ఎంజిఎం హెల్త్‌కేర్ హాస్పిటల్  2 వారాల క్రితమే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారని  దీపా అన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం సర్ మా కుటుంబానికి దగ్గరగా ఉన్నందున ఆసుపత్రి అధికారులు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితుల గురించి.. కొన్ని సార్లు నా తండ్రి వెంకయ్యకి కూడా తెలియజేస్తున్నారు, ”అని దీప తెలిపారు.

తన తండ్రికి చికిత్సనందించిన ఎంజీఎం ఆస్పత్రిపై విష ప్రచారం చేయడం సరికాదని ఎస్పీ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయి బాధపడుతున్న సమయంలో ఇలా లైవ్ లోకి రావడం దురదృష్టకరమని చరణ్ వాపోయాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త అబద్ధమని చరణ్ తెలిపారు. త్వరలోనే ఎంజీఎం ఆస్పత్రి వైద్యులతో కలిసి బాలు చికిత్స వివరాలు, బిల్లులు బయటపెడుతామని విలేకరుల సమావేశంలో చెబుతామని చరణ్ క్లారిటీ ఇచ్చారు. అపోలో హాస్పిటల్ కూడా తన నాన్న బాలు కోసం వైద్య పరికరాలు పంపించి సహకరించిందని చరణ్ తెలిపారు.  ఇలాంటి వార్తలు తమ కుటుంబానికి బాలుకు చికిత్స అందించిన డాక్టర్లకు, ఆస్పత్రికి నష్టం చేకూరుస్తాయని.. తప్పుడు ప్రచారం ఆపాలని చరణ్ తెలిపారు.