https://oktelugu.com/

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చరిత్ర తెలుసా?

ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి సినీప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గాత్రంతో ఎంతోమంది సినీ అభిమానులను మైమరిచేలా చేశారు. బాలసుబ్రహణ్యం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో పాటలుపాడి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. ఇటీవల ఆయనకు కరోనాకు సోకింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రతీఒక్కరు ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. వైద్యులు శతవిధాలా ఆయనను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. బాలు ఆరోగ్యం విషమంగా ఉందనే సమాచారం తెలియడంతో ప్రముఖులంతా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 12:25 PM IST
    Follow us on


    ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి సినీప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గాత్రంతో ఎంతోమంది సినీ అభిమానులను మైమరిచేలా చేశారు. బాలసుబ్రహణ్యం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో పాటలుపాడి కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు.

    ఇటీవల ఆయనకు కరోనాకు సోకింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రతీఒక్కరు ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. వైద్యులు శతవిధాలా ఆయనను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. బాలు ఆరోగ్యం విషమంగా ఉందనే సమాచారం తెలియడంతో ప్రముఖులంతా ఆయనకు కలిసేందుకు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

    * ఎస్పీ బాలు బయోడేటా..
    ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సాంబమూర్తి-శంకుతల. ఇటీవలే బాలసుబ్రహణ్యం 74వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన అభిమానులు బాలసుబ్రహమణ్యంను ముద్దుగా ‘బాలు’ అని పిలుచుకుంటారు. ఆయన తెలుగు, హిందీ, కన్నడ, తమిళ తదితర భాషల్లో 40వేలకు పైగా పాటలుపాడారు.

    బాలసుబ్రహణ్యం తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నతనం నుంచి సంగీతంపై మక్కువ పెరిగింది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరింగ్ చేశాడు. చదువుకుంటూనే అనేక వేదికలపై పాటలు పాడారు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా బాలు చిత్రసీమకు గాయకుడిగా పరిచయం అయ్యాడు.

    ఎస్పీబీ గాయకుడిగానే కాకుండా పలుచిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు. ప్రేమ.. ప్రేమికుడు.. పవిత్రబంధం.. ఆరోప్రాణం.. రక్షకుడు.. దీర్ఘసుమంగళిభవ తదితర సినిమాల్లో నటించి అభిమానులను అలరించారు. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, జెమిని గణేశ్ తదితరులకు తన గాత్రాన్ని అందించారు.

    బాలసుబ్రమణ్యం వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా రాణించారు. ఈటీవీలో పాడుతా తీయగా.. పాడాలని ఉంది.. స్వరాభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది గాయకులను చిత్రసీమకు పరిచయం చేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది.

    టాలీవుడ్లో 25సార్లు నంది అవార్డు అందుకున్న ఘనత బాలుకే సొంతం. ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆయనకు పలు పురస్కారాలు దక్కాయి. 2012లో ఆయన నటించిన ‘మిథునం’ సినిమాకు ఎస్పీబీకి ప్రత్యేక నంది అవార్డు దక్కడం విశేషం.