Korean Age : వయసులో ఉన్నప్పుడే అన్నీ చేసెయ్యాలి అంటారు పెద్దలు. అందుకే ఈ వయసు పోతే మళ్ళీ రాదు.. కష్టమైనా, సుఖమైనా ఇప్పుడే సాధించాలి. కానీ ఇందుకు భిన్నంగా దక్షిణ కొరియా వయసు పెరిగినప్పటికీ తగ్గిస్తామని అక్కడి ప్రజలకు హామీ ఇస్తోంది. ఇదేదో ఇంటర్ స్టేల్లర్ అనే హాలీవుడ్ సినిమా లో చూపించినట్టు అంతరిక్షంలోకి తీసుకెళ్లడం లేదు. ప్రజల కోసం మరో కొత్త లోకాన్ని సృష్టించడం లేదు. జస్ట్ ఆ దేశం ఇప్పటివరకూ ఉన్న వయసు గణనను పూర్తిగా మార్చి వేస్తోంది. స్థూలంగా చెప్పాలంటే వయసు లెక్కింపు వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేస్తోంది. కాదు ఈ మేరకు కొత్త చట్టాన్ని కూడా అమలులోకి తీసుకురాబోతోంది. ఇది గనక అమల్లోకి వస్తే ప్రతి వ్యక్తి వయసు ఒకటి లేదా రెండు సంవత్సరాలు తగ్గిపోతుంది. దీని ప్రకారం వారు యంగ్ గా మారిపోయినట్టే లెక్క.
దక్షిణ కొరియా ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఇప్పటివరకు ఉన్న “కొరియన్ ఏజ్” విధానానికి స్వస్తి పలికింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇకపై పౌరుల వయసు లెక్కించనుంది. కొరియన్ ఏజ్ ప్రకారం పుట్టిన వెంటనే వాళ్ళ వయసును ఏడాదిగా పరిగణిస్తారు. అంటే పుట్టిన వెంటనే వాళ్లకు ఒక సంవత్సరం నిండిపోయినట్టు లెక్క. ఆ తర్వాత కొత్త సంవత్సరం మొదలవుగానే రెండేళ్లు పూర్తయినట్టు పరిగణిస్తారు. ఉదాహరణకు డిసెంబర్ 31న ఒక శిశువు జన్మిస్తే వయస్సును ఏడాదిగా పరిగణిస్తారు. జనవరి 1న కొత్త ఏడాది ప్రారంభం కాగానే ఆ వయసును పెంచేసి రెండు సంవత్సరాలుగా లెక్క కడతారు. మరో విధానంలోనూ ఇలా వయసును లెక్కిస్తారు. ఒక శిశువు జన్మించిన సమయంలో వయసును “సున్నా”గా లెక్కిస్తారు. అయితే కొత్త ఏడాది మొదలుకాగానే 12 నెలలు అంటే లెక్కతో సంబంధం లేకుండా ఆ శిశువు వయసు ఏడాదిగా నిర్ధారిస్తారు.. కొత్త ఏడాదిలో వాళ్ళ వయసులు విధానం ప్రకారం తారు మారు అయిపోతాయి.
ఈ విధానం వల్ల కొరియన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్మోకింగ్, డ్రింకింగ్ కు సంబంధించిన ఏజ్ ఫ్యాక్టర్ తోనూ అక్కడి ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక సంస్థ సర్వే నిర్వహించింది. ప్రస్తుత వయసు గణన విధానంపై అభిప్రాయాలు సేకరించింది. దాదాపు 80% ప్రజలు ఈ విధానం సరైనది కాదని తమ అభిప్రాయాన్ని తెలిపారు. దక్షిణ కొరియాలో ఎన్నికల ప్రచార సమయంలో ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ ఈ వయసు లెక్కింపు విధానాన్ని పూర్తిగా మార్చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విధానం వల్ల అనవసరమైన చిక్కులు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన భావిస్తున్నారు. 1960 నుంచి ఆసియా దేశాలు మొత్తం అంతర్జాతీయ విధానాన్ని అనుసరించి వయసు లెక్కిస్తున్నాయి. బిడ్డ పుట్టినప్పుడు వయసు సున్నాగా పరిగణిస్తున్నాయి. 12 నెలలు గడిచిన తర్వాత ఏడాదిగా లెక్కిస్తున్నాయి. 2023 జూన్ నుంచి సౌత్ కొరియాలో ఇదే విధానం అమల్లోకి వచ్చేసింది. అంతర్జాతీయంగా ఆమోదయోగ్యంగా ఉన్న పద్ధతిలో ప్రజల వయసును లెక్కిస్తామని ఆ దేశ అధికారులు అంటున్నారు. ఈ కారణంగానే ఈ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజల వయసు ఒకటి నుంచి రెండు సంవత్సరాలు తగ్గనుంది. ఉదాహరణకు “గంగ్నం స్టైల్” సింగర్ ను పరిగణలోకి తీసుకుంటే డిసెంబర్ 31 1977 సంవత్సరంలో ఆయన జన్మించాడు. విధానాల ప్రకారం అతని వయసు 45 సంవత్సరాలు. ప్రస్తుతం క్యాలెండర్ విధానం ప్రకారం అతడి వయసు 46 సంవత్సరాలు. అంతకుముందున్న కొరియన్ విధానం ప్రకారం అతడి వయసు సంవత్సరాలు. ఇంతటి గందరగోళం ఉన్న నేపథ్యంలో వయసు లెక్కింపులో దక్షిణకొరియా పూర్తి అంతర్జాతీయ విధానాన్ని పాటించనుంది.