ఆ న్యూస్ చానళ్లకు ఊరట.. సీఐడీకి సుప్రీం నోటీసులు

ఎంపీ రఘురామకృష్ణంరాజును రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ఈ కేసులో ఏ2, ఏ3లుగా రెండు న్యూస్ చానెళ్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది. అయితే ఆ టీడీపీ అనుకూల చానెళ్లు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం మీడియాను బెదిరించేలా వ్యవహరిస్తోందని.. రాజద్రోహం కేసులను కావాలనే పెట్టిందని ఆరోపిస్తూ పిటీషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విషయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ చర్యలు తీసుకోవద్దని […]

Written By: NARESH, Updated On : May 31, 2021 6:41 pm
Follow us on

ఎంపీ రఘురామకృష్ణంరాజును రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ఈ కేసులో ఏ2, ఏ3లుగా రెండు న్యూస్ చానెళ్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది. అయితే ఆ టీడీపీ అనుకూల చానెళ్లు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వం మీడియాను బెదిరించేలా వ్యవహరిస్తోందని.. రాజద్రోహం కేసులను కావాలనే పెట్టిందని ఆరోపిస్తూ పిటీషన్లు దాఖలు చేశాయి.

వీటిపై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విషయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ అంశాన్ని రాజద్రోహంగా చూడటం సమంజసం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ సీఐడీకి నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.

రాజద్రోహం కేసుల విషయంలో స్పష్టమైన మార్గదర్వకాలు ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛను పౌరులకు కల్పించారు. అయితే వీటిని ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని గతంలో పిటీషన్లను ఇదే ధర్మాసనం విచారించి కొట్టివేసింది.

అయితే తీవ్ర విమర్శలను ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వారు ఆసరాగా తీసుకొని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారు. రాజద్రోహం కేసులు పెడుతున్నారు. దీనిపై కేంద్రప్రభుత్వం కూడా దృష్టి సారించి చట్టాలు మార్చే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి కేసులపై ఇప్పటికే ప్రత్యేక నిపుణుల కమిటీ నియమించింది. ఈ కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.