
‘మామగారు’ సినిమా సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తున్న రోజులు అవి. ఈ సినిమా దర్శకుడు ముత్యాల సుబ్బయ్యకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కానీ, ‘కలికాలం’ అనే కథనే సినిమాగా చేయాలని ముత్యాల సుబ్బయ్య నిర్ణయించుకున్నాడు. ఏ నిర్మాత ముందుకు రాలేదు. దాంతో ఇది చిన్న సినిమా అయిపోయింది. కాకపొతే కథ బాగుంది. జయసుధ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ జయసుధ అప్పటికే పది లక్షలు తీసుకుంటుంది.
పైగా ఆరు లక్షలు అడ్వాన్స్ గా ఇవ్వాలి. ఎలాగోలా ముత్యాల సుబ్బయ్య జయసుధ దగ్గరకు వెళుతున్నాం. అంటూ ఓ స్నేహితుడి దగ్గర నుండి ఆరు లక్షలు పట్టుకుని బయలుదేరాడు ముత్యాల సుబ్బయ్య. రచయిత తోటపల్లి మధుతో కలసి జయసుథ ఇంటిలో ఆమె కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ముత్యాలకు జయసుధతో మంచి పరిచయం ఉంది గానీ, ఎప్పుడూ కలసి ఆమెతో పని చేయలేదు.
పైగా ఆర్టిస్ట్ గా జయసుధ అంటే తనకు ఎంతో అభిమానం ఉంది. అందుకే, ఈ కథకు జయసుధే కరెక్ట్ అని మొదటినుంచీ ముత్యాల సుబ్బయ్య చాల బలంగా నమ్మారు. జయసుధ ఒప్పుకుంటే సినిమా సగం సక్సెస్ అయినట్లే అనుకున్నాడు. కట్ చేస్తే.. అంతలో జయసుధ వచ్చి ఎదురుగా కూర్చుంది. తోటపల్లి మధు కథ నేరేట్ చేయడం మొదలు పెట్టాడు.
జయసుధ పూర్తి ఏకాగ్రతతో కథను వింది. కథ వినడం పూర్తయిన తర్వాత, జయసుధ ఆలోచనలో పడింది. రెండు నిమిషాల సైలెన్స్ తరువాత ‘ఏమండి సుబ్బయ్యగారు.. నాకు కొంచెం సమయం కావాలి అండి. రేపు వదిలెయ్యండి. ఎల్లుండి మనం కలుద్దాం. అప్పుడే ఫైనల్ చేసుకుందాం’ అంది. కరెక్ట్ గా పదిహేను రోజుల తర్వాత ‘కలికాలం’ సినిమా పూజతో మొదలైంది. ఈ సినిమాతో జయసుధ, తానూ మరో సావిత్రిని అని పేరు తెచ్చుకుంది.