
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలోని పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 15 వరకూ డైట్ కళాశాలలకు కూడా సెలవులు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ సంచాలకురాలు శ్రీ దేవ సేన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.