ప్రభుత్వాలు చేయలేని పని చేస్తున్న రియల్ హీరో

కరోనాతో దేశమంతా అల్లకల్లోలంగా మారింది. ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతున్నాయి. తాజాగా గోవాలో 30 మంది ఇలానే అసువులు బాసారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ రియల్ హీరో సోనూ సూద్ మాత్రం అనుకున్నది సాధించారు. ఈ కష్టకాలంలో తానున్నాంటూ ముందుకొచ్చాడు. మొదటి లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ ఎంతో మంది వలస కూలీలను ఇళ్లకు చేర్చి వారికి దేవుడిగా మారాడు. […]

Written By: NARESH, Updated On : May 11, 2021 6:08 pm
Follow us on

కరోనాతో దేశమంతా అల్లకల్లోలంగా మారింది. ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతున్నాయి. తాజాగా గోవాలో 30 మంది ఇలానే అసువులు బాసారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి.

కానీ రియల్ హీరో సోనూ సూద్ మాత్రం అనుకున్నది సాధించారు. ఈ కష్టకాలంలో తానున్నాంటూ ముందుకొచ్చాడు. మొదటి లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ ఎంతో మంది వలస కూలీలను ఇళ్లకు చేర్చి వారికి దేవుడిగా మారాడు. దేశంలో ఏ మూల ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా సోషల్ మీడియా ద్వారా అడిగిన వారికి క్షణాల్లో స్పందిస్తూ పరిష్కారం చూపుతున్నారు.

తాజాగా ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్న వారిని చూసి చలించిన సోనూ సూద్ ఇకపై అలా జరగకుండా ఉండేందుకు ఆక్సిజన్ ప్లాంట్లనే నెలకొల్పేందుకు సిద్ధమవ్వడం విశేషం. ఈ క్రమంలోనే ముందుగా నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్రాన్స్ తోపాటు ఇతరదేశాల నుంచి వీటిని కొని ఇండియాలో నెలకొల్పనున్నారు.

ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ఢిల్లీ, మహారాష్ట్రతోపాటు కొవిడ్ కేసులు అధికంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు తాము ఆర్డర్ ఇచ్చిన తొలి ఆక్సిజన్ ప్లాంట్ ఫ్రాన్స్ నుంచి మరో 10 రోజుల్లో రాబోతోందని సోనూ సూద్ హామీనిచ్చారు. ఆక్సిజన్ ను సమయానికి అందించేలా మా వంతు కృషి చేస్తున్నాం అని సోనూ సూద్ తెలిపారు.