పైగా ఎన్టీఆర్ ఖాకీ బట్టలు ధరించారు. చైతన్య రథం అంటూ ఊళ్లు తిరగడం మొదలెట్టారు. ఆ క్రమంలో ఎన్టీఆర్ ఆ రోజు ఏలూరుకి వెళ్తున్నారు. అప్పటికే ఏలూరులో ‘పిచ్చిపంతులు’ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ షూట్ లో రావుగోపాలరావు, సత్యనారాయణ, గిరిబాబులతో పాటు మురళీమోహన్ కూడా ఉన్నారు. ఇక ‘ఎన్టీఆర్ ఏలూరు వచ్చారనే కబురు అందిన వెంటనే, షూటింగ్ బ్రేక్ ఇచ్చి అందరూ వెళ్లి ఎన్టీఆర్ ని కలిశారు.
సభ మొదలైంది. ప్రజలతో పాటు అక్కడ ఉన్న ప్రముఖ నటులు కూడా ఎన్టీఆర్ గారి స్పీచ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సినిమాల్లో ఎక్కువగా ఎన్టీఆర్ డైలాగ్ లు ఆవేశంగా ఉంటాయి. మరి బయట ఆయన ఎలా మాట్లాడుతారు. చూస్తే ఎదురుగా జనం వేలమంది వచ్చి నిలబడ్డారు. అంతమందిని చూసి రావుగోపాలరావుకి చమటలు పట్టాయి. అరె సమయానికి స్పీచ్ రాయడానికి మంచి రైటర్ కూడా లేడే అని మనసులోనే అనుకుంటూ చుట్టూ టెన్షన్ గా చూశారు రావుగోపాలరావు.
అంతలో ఎన్టీఆర్ స్పీచ్ మొదలైంది. ఆ స్పీచ్ వింటుంటే రావుగోపాలరావులో ఆవేశం, గొప్ప రచయిత కూడా అన్నగారిలా మాటలు రాయలేరు అనుకున్నారు మనసులో. ఎంతైనా ఎన్టీఆర్ మహానటుడు మహా దర్శకుడే కాదు, మహా రచయిత కూడా అని ఎమోషనల్ గా పక్కన ఉన్న ప్రముఖ నటుడు సత్యనారాయణతో అన్నారట.
అప్పటికే సత్యనారాయణ కళ్ళల్లో కన్నీళ్లు. అందరూ ఎన్టీఆర్ గారి స్పీచ్ వింటుంటే.. సత్యనారాయణగారు మాత్రం ఎన్టీఆర్ గారి ఆవేశాన్ని చూసి ఆయన ఆరోగ్యం ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నారు. ఆయనకు ఎన్టీఆర్ అంటే అంత ప్రేమ ఉండేది. ఎన్టీఆర్ స్పీచ్ ముగిసింది. అక్కడున్న అందరికీ ఎంతో స్ఫూర్తిమంతంగా అనిపించింది ఆ స్పీచ్. ఆ స్ఫూర్తితోనే పైన చెప్పిన నటులంతా ఆ తరువాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి గెలిచారు కూడా.