Sonu Sood Plate : హైదరాబాద్ వాసులు మాంసాహార ప్రియులు. అందుకే హైదరాబాద్ బిర్యానీకి అంత గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో బిర్యానీ అంటే అందరికి నోరూరుతుంది. మన బిర్యానీకి ఎంతో ప్రాచుర్యం దక్కింది. దేశంలో ఎక్కడి వారైనా ఇక్కడకు వచ్చినప్పుడు బిర్యానీని రుచి చూడందే వెళ్లరు. దీంతో మన బిర్యానీకి మంచి డిమాండ్ ఏర్పడింది. నగరంలో బిర్యానీ అంటే అందరికి మహా ఇష్టమే. మన బిర్యానీకి ఉన్న విలువ అలాంటిది. అలా మనకు బిర్యానీపై మక్కువ ఎంతో ఎక్కువ.
ప్రముఖ సినీనటుడు సోనూసూద్ సామాజిక వేత్త. సమాజానికి సేవ చేయడంలో ఆయనదో ప్రత్యేకమైన శైలి. అందుకే ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులుండటం విశేషం. కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సామాజిక కార్యక్రమాలు ఎవరు మరిచిపోలేరు. ఎవరికైనా ఆపద వచ్చిందంటే నేనున్నానంటూ భుజం కలపడం ఆయనకున్న మంచితనం. అందుకే ఆయన పలు కార్యక్రమాల ద్వారా అందరిలో ఎంతో స్ఫూర్తి నింపుతున్నారు. సామాజిక సేవలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
నగరంలోని ఓ రెస్టారెంట్లో బిగ్గెస్ట్ ప్లేట్ తీసుకొచ్చారు. దీన్ని స్వయంగా సోనూసూదే ప్రారంభించారు. అందులో ఒకేసారి దాదాపు ఇరవై మంది బిర్యానీ తినొచ్చు. సోనూసూద్ ప్రారంభించిన ఈ ప్లేటులో మొదట అనాథ పిల్లలు బిర్యానీ తినడం విశేషం. అలా సోనూసూద్ పేర ఓ ప్లేట్ తీసుకొచ్చి అందరికి అందించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శనివారం కొండాపూర్ లోని జిస్మత్ జైల్ నుంచి ప్రారంభించినట్లు నిర్వాహకురాలు గౌతమి, ధర్మా గౌతమ్ తెలిపారు.
రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరు, నెల్లూరుతో పాటు బెంగుళూరులోని తమ బ్రాంచీల్లో సోనూసూద్ బిగ్గెస్ట్ ప్లేట్ బిర్యానీని అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. విభిన్న రుచులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నగరంలో బిగ్గెస్ట్ బిర్యానీని తీసుకురావడం ఆనందంగా ఉందని జిస్మత్ మండీ నిర్వాహకులు అన్నారు. కొత్త కాన్సెప్ట్ లతో భోజనం అందిస్తే ఆదరణ లభిస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నందున వంటకాల్లో ఎక్కడ లోటుండదు.