ఒక ప్రభుత్వాలు చేయలేని పనిని కూడా చేస్తూ ప్రముఖ నటుడు సోనూ సూద్ తన ఉదారత చాటుకుంటున్నాడు. కరోనా మొదటి వేవ్ లో ఎంతో మంది వలస కార్మికులను ఇంటికి చేర్చిన అతడు.. ఇప్పుడు సెకండ్ వేవ్ లోనూ తానున్నాంటూ సాయం చేస్తున్నాడు.
ఒక దిగ్గజ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ కు టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా తాజాగా ట్విట్టర్ లో వేడుకున్నాడు. తన అత్త కరోనా బారినపడిందని.. ఆమెకు అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలని.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ప్రస్తుతం ఆమె తీవ్రగా బాధపడుతున్నారంటూ సురేష్ రైనా ట్వీట్ చేశాడు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ట్విట్టర్ లో వేడుకున్నాడు.
దీనికి స్పందించిన సోనూ సూద్.. 10 నిమిషాల్లోనే ఆక్సిజన్ సిలిండర్ అక్కడికి వస్తుంది అంటూ సురేష్ రైనా ట్వీట్ కు సమాధానం ఇచ్చాడు. అనుకుంటుండగానే సిలిండర్ ను చేరవేశాడు.
సోనూ సూద్ బృందం దేశవ్యాప్తంగా ప్రజలకు విస్తృతంగా సేవలను అందిస్తోంది. ఆయన త్యాగనిరతిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇటీవల కర్ణాటకలోని సోనూ సూద్ బృందం 22 మంది ప్రాణాలను కాపాడారు. బెంగళూరులోని అరక్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని సత్యనారాయణ్ అనే పోలీస్ అధికారి తాజాగా కర్ణాటకలోని సోనూ సూద్ బృందానికి విన్నవించారు. దీంతో వెంటనే 16 ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులోకి ఉంచి ప్రాణాలు కాపాడారు.
ఇలా సోనూ సూద్ ఎక్కడున్నా.. తన బృందంతో, సూద్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. సోనూ చూపిస్తున్న చొరవకు ప్రశంసలు కురుస్తున్నాయి.