https://oktelugu.com/

అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా?

కాంగ్రెస్ అధ్యక్ష పదవీని చేపట్టేందుకు సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే తిరిగి కొనసాగాల్సి వస్తోంది. సోనియాగాంధీకి వయస్సు పైబడటంతో ఇంతకముందుగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. దీంతో ఆమె ఆ పదవీ నుంచి తప్పుకొని రాహుల్ గాంధీకి పదవీ కట్టబెట్టాలని భావించారు. పార్టీలో సీనియర్ల హవానే కొనసాగుతుండటంతో రాహుల్ ఆ పదవీ చేపట్టేందుకు ససేమిరా అంటున్న సంగతి తెల్సిందే. Also Read: ప్రధానికి లేఖ రాసిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 28, 2020 12:23 pm
    Follow us on


    కాంగ్రెస్ అధ్యక్ష పదవీని చేపట్టేందుకు సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే తిరిగి కొనసాగాల్సి వస్తోంది. సోనియాగాంధీకి వయస్సు పైబడటంతో ఇంతకముందుగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. దీంతో ఆమె ఆ పదవీ నుంచి తప్పుకొని రాహుల్ గాంధీకి పదవీ కట్టబెట్టాలని భావించారు. పార్టీలో సీనియర్ల హవానే కొనసాగుతుండటంతో రాహుల్ ఆ పదవీ చేపట్టేందుకు ససేమిరా అంటున్న సంగతి తెల్సిందే.

    Also Read: ప్రధానికి లేఖ రాసిన సీఎం జగన్… ఎందుకోసమంటే..?

    సోనియా, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ అధ్యక్ష పదవీ నుంచి తప్పుకోనున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నుంచి చేజారిపోతుందా? అన్న సందేహాలు కూడా కలిగాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు మూకుమ్మడిగా లేఖ రాశారు. దీనిలో పార్టీలో నెలకొన్న్ పరిస్థితులు.. పార్టీ ప్రక్షాళన వంటి అనేక కీలక అంశాలను పేర్కొన్నారు. ఈ లేఖపై రాహుల్ గాంధీ సైతం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెసులోని కొందరు బీజేపీకి పావులుగా మారారనే ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణమాల మధ్య కాంగ్రెస్ అధ్యక్ష పదవీని తిరిగి సోనియాగాంధీ చేపట్టాల్సి వచ్చింది.

    ఈనేపథ్యంలోనే సోనియాగాంధీ కాంగ్రెసులో అసమ్మతికి కారణమైన లేఖ రాసిన నేతలను కట్టడి చేయనున్నారని తెలుస్తోంది. ఈ లేఖ రాయడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే విషయాన్ని తేల్చేందుకు సోనియాగాంధీ కమిటీని వేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కు సోనియా సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న గులాంనబీ ఆజాద్, డిప్యూటి లీడర్ ఆనంద్ శర్మలను సోనియా పక్కన పెట్టనున్నారనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా?

    వీరికి బదులుగా సోనియా రాజకీయ సలహాదారు అయిన అహ్మద్ పటేల్, నమ్మకస్థుడైన కేసీ వేణుగోపాల్ కు రాజ్యసభలో బాధ్యతలు అప్పగించనున్నారనే టాక్ విన్పిస్తోంది. లోక్ సభలోనూ ఇదే తరహాలో కమిటీ నియమించనున్నట్లు తెలస్తోంది. గౌరవ్ గొగోయ్ డిప్యూటి లీడర్ గా, రవ్నీత్ సింగ్ బిట్టును విప్ గా నియమించబోతున్నారట. అయితే తొలుత అసమ్మతి నేతలపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసిన అధిష్టానం తాజాగా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతుండటం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.