ఆ ముగ్గురికి కేసీఆర్ వరం

కొత్త నీరు వస్తుంటే.. పాత నీరు పోతూనే ఉంటుంది. తెలంగాణ రాజకీయంలో కూడా ఒకప్పుడు వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు కనుమరుగైపోయారు. అడ్రస్ లేకుండా పోయారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో వారికి పెద్దపీట వేసిన కేసీఆర్ రెండోసారి గెలిచాక కనీసం దగ్గరికి కూడా రానీయడం లేదు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. ఆ టీఆర్ఎస్ సీనియర్లకు పార్టీలో ఎటువంటి పాత్ర లేకుండా పూర్తిగా పక్కనపెట్టేలా చేసింది. Also Read: ప్రజారోగ్యం కేసీఆర్ సార్ కు పట్టదా? […]

Written By: NARESH, Updated On : August 28, 2020 11:51 am
Follow us on


కొత్త నీరు వస్తుంటే.. పాత నీరు పోతూనే ఉంటుంది. తెలంగాణ రాజకీయంలో కూడా ఒకప్పుడు వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు కనుమరుగైపోయారు. అడ్రస్ లేకుండా పోయారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో వారికి పెద్దపీట వేసిన కేసీఆర్ రెండోసారి గెలిచాక కనీసం దగ్గరికి కూడా రానీయడం లేదు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. ఆ టీఆర్ఎస్ సీనియర్లకు పార్టీలో ఎటువంటి పాత్ర లేకుండా పూర్తిగా పక్కనపెట్టేలా చేసింది.

Also Read: ప్రజారోగ్యం కేసీఆర్ సార్ కు పట్టదా?

కానీ ఇప్పుడు కేసీఆర్ పాత సీనియర్లను అక్కున చేర్చుకోవాలని భావిస్తున్నాడట.. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ తుమ్మల నాగేశ్వరరావు , మాజీ మంత్రులు చందూలాల్, జూపల్లి కృష్ణారావులు ప్రస్తుతం భవిష్యత్ పై బెంగతో స్తబ్దుగా ఉన్నారు. వారిని పునరావాసం కల్పించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలిసింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసి మరీ జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ వెంట నడిచారు. ఇక కేసీఆర్ స్వయంగా తుమ్మల వద్దకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక చందూలాల్ కూడా టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి చేపట్టారు.

ఇలా తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన కీలమైన ముగ్గురు నాయకులు తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వారి తలరాత మారిపోయింది. ప్రస్తుతం తుమ్మల, చందులాల్ చాలా నిశ్శబ్ధంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. ఇక జూపల్లి మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్లు తన అనుచరులకు ఇవ్వలేదని తిరుగుబాటు ఎగురవేశారు. ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థులను ఓడించాడు.

Also Read: శకుంతలా దేవి రికార్డును బ్రేక్ చేసిన హైదరాబాదీ

ఈ ముగ్గురు సీనియర్లు ఇప్పుడు రాజకీయ పునారావాసం కోసం ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. అయితే వీరిలో ఇద్దరు తుమ్మల, చందూలాల్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.జూపల్లికి నామినేట్ పోస్టు ఇవ్వవచ్చని తెలుస్తోంది.