Sonam Wangchuk arrested: దేశంలో శాంతియుత వాతావరణం కోసం కేంద్ర ప్రయత్నిస్తుంటే.. చిన్నచిన్న ఉద్యోమాలతో దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు మణిపూర్‌లో ఉద్యమం జరిగింది. తాజాగా లడఖ్‌లో అల్లర్లు అనూహ్యంగా ప్రారంభమైనప్పటికీ, వాటి వెనుక ఉన్న ప్రణాళిక విస్తృతమైనదే. దీనిని ఒక సడెన్ రెస్పాన్స్ ఉద్యమంగా కాకుండా, చాలా రోజులుగా క్రమంగా నడిపిస్తున్న వ్యూహాత్మక చర్యగా చూడాల్సింది.
రాష్ట్ర హోదా డిమాండ్ తో తిరుగుబాటు..
లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు స్థానికులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. అయితే కొద్ది కాలంలోనే రాష్ట్ర హోదా కోసం డిమాండ్ ప్రారంభమైంది. ఇది సహజసిద్ధమైన స్థాని క హక్కుల పోరాటం కాకుండా, ప్రణాళికబద్ధమైన రాజకీయ తద్వారా అంతర్జాతీయ దష్టి ఆకర్షించాలనే ప్రయత్నం అని చెప్పవచ్చు. మెగసెసె అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చూ, ఈ ఉద్యమానికి ప్రధాన నాయకుడిగా ఎదిగారు. ఆయన నడిపిన సంస్థలకు లైసెన్స్ రద్దు కావడమే మొదటి ఘర్షణ. వాంగ్‌చూ తండ్రి కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి కావడం వలన ఆయన రాజకీయ నేపథ్యం కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం. ఆయన సంస్థలకు ఇచ్చిన భూమి లీజు రద్దు తరువాత ఆయన క్రమంగా రాష్ట్ర హోదా ఉద్యమం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే – ఒక విద్యా, సాంస్కృతిక కార్యకర్త ఒక్కసారిగా ఎందుకు హింసాత్మక ఉద్యమానికి పూనుకుంటారు? సమాధానం – ఒకవైపు వ్యక్తిగత నష్టం, మరోవైపు రాజకీయ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న వ్యూహం.
శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తరహా ఉద్యమం?
లడఖ్ ఉద్యమాన్ని కేవలం స్థానిక అసంతృప్తిగా చూడటం తేలికైన నిర్ణయమే అవుతుంది. వాంగ్‌చూ ప్రసంగాలు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల తీరును పోలి ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇక అరెస్ట్ అయిన వారిలో కొందరు నేపాల్‌కు చెందినవారు కావడం కూడా ఈ వాదనను బలపరుస్తోంది. చిన్నచిన్న ప్రాంతాల్లో హింస చెలరేగించడం ద్వారా ప్రపంచ మీడియా అటెన్షన్ పొందాలన్న గ్లోబల్ ప్రొటెస్టు మోడల్ ఇక్కడ ప్రయోగించినట్లు కనిపిస్తోంది.
విఫలమైన పూర్వపు ఉద్యమాలు..
ఇంతకు ముందు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ కారణాల పేరుతో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. మణిపూర్, మిజోరాంలో హింసా ఘటనలు. బత్తీపూర్ ‘దీపాలు ఆర్పేయాలి‘ ఉద్యమం. ‘సర్ రద్దు చేయాలి‘, ‘ఐలవ్ మహ్మద్‘ వంటి తాత్కాలిక జాతీయ–మత సంబంధిత ఉద్యమాలు. పాలస్తీనా మద్దతు కోసం ఒక వర్గం చేసిన ప్రయత్నం. ఇవన్నీ ప్రభావం చూపడంలో విఫలమైన కారణంగా లడఖ్‌ను కొత్త వేదికగా ఎంచుకున్నారని అనిపిస్తుంది. చిన్న జనాభా (10 వేల వరకు) ఉన్న ప్రాంతంలో ఉద్యమం ప్రారంభించడం ద్వారా కేంద్రానికి కంట్రోల్ చేయడం కష్టమవుతుంది అనే లెక్కలతో ముందుకెళ్లారు.
చెక్ పెట్టిన మోదీ..
కేంద్రం ఈసారి రెండు ప్రధాన విధానాలను అనుసరించింది. నేరుగా వాంగ్‌చూ అరెస్టు చేయకుండా, ఆయన సంస్థల లైసెన్స్ రద్దు చేసి అడ్డుకోవడం. బయటివారి ప్రమేయాన్ని బహిర్గతం చేసి ఉద్యమం నిజాయితీపై ప్రశ్నలు లేవనెత్తడం. దీంతో మద్దతు కూడగట్టే ప్రయత్నం కొంతమేర బలహీనపడింది. అరెస్ట్ అయిన వారిలో స్థానికేతరులే ఉండటం ద్వారా ఉద్యమం స్థానిక సమస్య కాదని, బయటివారి ప్రేరేపణ అని కేంద్రం నిరూపించాలనుకుంది. అక్టోబర్ 6న జరగనున్న సమావేశం కీలక మలుపు కాగలదు. అంతర్గత అసంతృప్తి, బయటివారి మద్దతు కలగలిపి కొత్త వ్యూహాలతో ముందుకు వచ్చి పరిస్థితిని మరల అశాంతంగా మార్చే అవకాశం ఉంది.
లడఖ్‌లోని ఈ ఉద్యమం స్థానిక అసహనం మాత్రమే కాదు, వ్యక్తిగత నష్టాలు, రాజకీయ మద్దతు, అంతర్జాతీయ ప్రభావం అనే మూడు అంశాలు కలగలిపిన ఫలితం. చిన్న జనాభా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ దృష్టి ఆకర్షించే సామర్థ్యం ఉన్న వేదిక కావడంతో దీన్ని పెద్ద ప్రణాళికలో భాగంగా చూడాలి.