Somu Veerraju: పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే రూ. వేల కోట్లు ఖర్చు చేశారు. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మళ్లీ డబ్బులు కావాలని అడుగుతున్నారు. అసలు పనిపై శ్రద్ధ ఉందా? లేక పైసలు కావాలని చూస్తున్నారా? అని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు సోము వీర్రాజు జలవనరుల శాఖ మంత్రిని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా మారింది. శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు దోచిపెట్టడం తప్ప ఏం చేస్తున్నారు? పరిపాలన అంటే పైసలు పంచడం కాదు ప్రజల బాగోగులు కూడా చూసుకోవాలి. అంతేకాని ఏదో డబ్బులు ఇస్తున్నాం కదా అని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే సరైన గుణపాఠం చెప్పడం ఖాయం.

పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ఏం చర్యలు తీసుకుంటోంది. పనులు ఎక్కడి దాకా వచ్చాయి? ప్రజలు అడుగుతారు సమాధానం చెప్పాల్సిందే. లేదంటే కుదరదు. డబ్బులు అన్ని ఏం చేస్తున్నారు? పనులు ఏ స్థాయిలో ఉన్నాయో? ఎంత ఖర్చయిందో వివరాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఇవేమీ చెప్పకుండా డబ్బులు కావాలని అడుగుతూ నిత్యం వేధింపులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా. నేతల్లో సమన్వయం ఉందా అని అడుగుతున్నారు.
Also Read: Hyderabad Gang Rape- Political Row: ఆ నోళ్లెందుకు మూగబోయాయి.. మౌనం అంగీకారమా?
పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా చేయాల్సి ఉన్నా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆంధ్రుల కలల ప్రాజెక్టుగా ప్రజలకు దానిపై ఎన్నో ఆశలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ నిర్వాకంతోనే సమస్యలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ పనులు నిర్వహించడంలో తాత్సారం చేస్తోంది. అఅదుకే పనులు ఆలస్యం అవుతున్నాయి. ప్రాజెక్టు ఏళ్లుగా పెండింగులోనే ఉంటోంది. దాని నిర్వహణ బాధ్యత ప్రభుత్వం చేపట్టి పనులు చురుగ్గా చేయాలి.

ప్రతి ఎన్నికల్లో పోలవరం ఒక నినాదంగా మారుతోంది. రాజకీయ పార్టీలకు వరంగా ఉంటోంది. దీంతో దాని పేరు చెప్పి ఓట్లు రాబట్టుకోవడం కోసమే పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఓట్లపై ఉన్న శ్రద్ధ పనులపై కనిపించడం లేదు. అందుకే హైడల్ ప్రాజెక్టుగా మారుస్తామని చెబుతున్నా ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. దీనిపై జలవనరుల శాఖ మంత్రి సమాధానం చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై ఎందుకంత నిర్లిప్తత అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైసీపీ ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే మరి.
Also Read:Nandamuri Taraka Ratna: ఎన్టీఆర్ పై నందమూరి ఫ్యామిలీ కుట్ర… తారక రత్న ఏమన్నాడు!
Recommended Videos