https://oktelugu.com/

బీజేపీ పితలాటకం.. తిరుపతిలో గెలిపిస్తేనే కేంద్రం నిధులా?

‘ఇచ్చే వాణ్ణి చూస్తే.. చచ్చేవాడు కూడా లేచివస్తాడు’ అని బీజేపీ నాయకులు అనుకుంటున్నారట. దుబ్బాక ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో మంచి జోష్ ని నింపాయి. తెలంగాణలోనే కాదు. దుబ్బాక ఫలితం ఆంధ్రప్రదేశ్ లో బాగానే కనిపిస్తోంది. బీజేపీ బలపడుతున్న సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నట్లుగా బీజేపీ నేతలు అనుకుంటున్నారట. ఇదే జోష్ లో ఏపీలోనూ బలంగా పాగా వేయాలని ప్యూహరచన చేస్తున్నారట. Also Read: ఏపీలో ఈ లొల్లి వద్దు.. ఢిల్లీకి పోతాం… అదే స్పూర్తితో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2020 / 09:00 AM IST
    Follow us on

    ‘ఇచ్చే వాణ్ణి చూస్తే.. చచ్చేవాడు కూడా లేచివస్తాడు’ అని బీజేపీ నాయకులు అనుకుంటున్నారట. దుబ్బాక ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో మంచి జోష్ ని నింపాయి. తెలంగాణలోనే కాదు. దుబ్బాక ఫలితం ఆంధ్రప్రదేశ్ లో బాగానే కనిపిస్తోంది. బీజేపీ బలపడుతున్న సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నట్లుగా బీజేపీ నేతలు అనుకుంటున్నారట. ఇదే జోష్ లో ఏపీలోనూ బలంగా పాగా వేయాలని ప్యూహరచన చేస్తున్నారట.

    Also Read: ఏపీలో ఈ లొల్లి వద్దు.. ఢిల్లీకి పోతాం…

    అదే స్పూర్తితో తిరుపతికి జరిగే ఉపఎన్నికలో తాము గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారట. తాజాగా “తిరుపతి లోకసభ ఉపఎన్నికల్లో బీజేపీ-జనసేన కి మద్దతు ఇచ్చి మా అభ్యర్థి ని గెలిపిస్తే కేంద్రం నుండి మరిన్ని నిధులు ప్రాజెక్ట్లులు వచ్చే అవకాశం ఉంటుంది. వైకాపా అభ్యర్థి గెలిపిస్తే ఏమి రాదు. ఉన్న 23మంది ఎంపీలను ఏమి చేసుకోవాలో ముఖ్యమంత్రికి తెలియదు,” అంటూ చెప్పుకొచ్చారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అయితే ‘దేశం మొదట.. పార్టీ తరువాత.. చివరిగా నేను’ అని చెప్పుకునే పార్టీ తమను గెలిపిస్తేనే కేంద్రం నుండి మరిన్ని నిధులు ప్రాజెక్ట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం ఏంటని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వంగా అందరికీ న్యాయం చేస్తారా లేక మాకు ఓట్లు వేసినవారికే నిధులు ప్రాజెక్టులు అంటారా అని వారు ఎద్దేవా చేస్తున్నారు.

    సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు అకాల మరణం కారణంగా తిరుపతి లోక సభకు ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఇప్పటికే అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం తమ అభ్యర్థులను ప్రకటించాయి. దివంగత ఎంపీ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడం లేదన్న ప్రచారం సాగుతోంది. 1999లో ఈ నియోజకవర్గంలో టీడీపీ మద్దతుతో బీజేపీ ఒకసారి గెలిచింది.

    Also Read: తొలి ఆంధ్రా న్యూస్ ఛానల్ ఎందుకు మూసివేయాల్సి వచ్చిందంటే?

    వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు, తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న ఉదాసీనత, ఇప్పటికీ కోలుకోలేకపోతున్న కాంగ్రెస్ కారణంగా ఏపీలో బలాన్ని పెంచుకోవాలని తెగ ప్రయత్నం చేస్తోంది బీజేపీ. ఏపీ మీద ఫోకస్ పెట్టిన బిజెపి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఏపీలో అధికారంలోకి రావాలని తెగ ప్రయత్నిస్తోందట .

    ఈ నేపథ్యంలో దూకుడు పెంచిన బీజేపీ ఏపీలో అధికార వైసీపీ కంటే టీడీపీ పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో టీడీపీ నేతలపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించడం అందుకు ఉదాహరణ. ఏపీలో టీడీపీ లేకుంటే ప్రత్యామ్నాయం బీజేపీనే.. ఏపీలో టీడీపీని లేకుండా చేస్తే అధికార పార్టీ అయిన వైసిపికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారట.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    టీడీపీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడం కోసం, అలాగే టీడీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీడీపీని ఖాళీ చేయాలని బిజెపి రకరకాలుగా ప్రయత్నాలు సాగిస్తోందన్న ప్రచారం సాగుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకు సాగుతున్నారట.