భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపు(మంగళవారం) తిరుమలకు రానున్నారు. కుటుంబసమేతంగా తిరుమలకు చేరుకొని ఉదయం 10.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకోనున్నారు. ఈ మేరకు అధికారులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. రాష్ట్రపతికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకనున్నారు. కాగా సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు.