AP BJP Somu Veeraju: ఏపీ బీజేపీ బలోపేతానికి సోము వీర్రాజు మాస్టర్ ప్లాన్

AP BJP Somu Veeraju: ఏపీ బీజేపీ బలోపేతానికి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాస్టర్ ప్లాన్ వేశారు.క్షేత్రస్థాయిలో బలోపేతానికి నడుం బిగించారు. ఈ క్రమంలోనే శక్తి కేంద్రాల ఏర్పాటుకు పూనుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని శక్తిమంతం చేయడమే ధ్యేయంగా ముందుకెళుతున్నారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. పోలింగ్ బూత్ స్ధాయిలో పార్టీని బలోపేతం చేయడానికి క్షేత్రస్ధాయిలో నాయకత్వం పనిచేయాలని బిజెపి శ్రేణులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపు నిచ్చారు. […]

Written By: NARESH, Updated On : February 12, 2022 8:53 pm
Follow us on

AP BJP Somu Veeraju: ఏపీ బీజేపీ బలోపేతానికి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాస్టర్ ప్లాన్ వేశారు.క్షేత్రస్థాయిలో బలోపేతానికి నడుం బిగించారు. ఈ క్రమంలోనే శక్తి కేంద్రాల ఏర్పాటుకు పూనుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని శక్తిమంతం చేయడమే ధ్యేయంగా ముందుకెళుతున్నారు. ఈ మేరకు బీజేపీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.

పోలింగ్ బూత్ స్ధాయిలో పార్టీని బలోపేతం చేయడానికి క్షేత్రస్ధాయిలో నాయకత్వం పనిచేయాలని బిజెపి శ్రేణులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపు నిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమీక్షా కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సమీక్ష నిర్వహించారు. ఐదు పోలింగ్ బూత్ ల కేంద్రాన్ని ఒక శక్తి కేంద్రంగా నిర్ణయించి న నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 60 శాతం శక్తి కేంద్రాలకు ఇన్ చార్జిలను నియమించినట్లు జిల్లా నాయకులు ఈ సందర్బంగా వివరించారు.

ప్రధాని నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం శక్తి కేంద్రాల స్ధాయిలో నిర్వహించాలని రాష్ట్ర అధ్యక్షులు కార్యకర్తలకు ఉధ్బోద చేశారు. ప్రతి పోలింగ్ బూత్ కి ఇన్ ఛార్జిని సకాలంలో నియమించి రాష్ట్ర కార్యాలయానికి నివేదించాలన్నారు. బిజెపి చేపట్టిని విధానాన్నే పికే అమలు చేస్తున్న విషయాన్ని వివరించారు . బిజెపి విధానాన్ని పికే వేరే మార్గంలో వివిధ పార్టీలతో అమలు చేస్తున్న విషయాన్ని వివరించారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ్రుద్ది కార్యక్రమాలను పోలింగ్ బూత్ స్ధాయిలో ప్రచారం చేయాలని కోరారు.

క్షేత్రస్దాయిలో కార్యకర్తలు ఆత్మ విశ్వాసంతో పనిచేస్తేనే పార్టీ బలపడుతుందన్నారు. ఎన్నికల సమయానికి అందరూ బలమైన నేతలుగా ఎదగాలన్నారు.. ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడ్డూరి శ్రీరాం, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసం ఉమామహేశ్వర రాజు, బుచ్చి బాబు, లక్ష్మి పతి రాజా ఈ కార్యక్రమంలొ జిల్లా బిజెపి నేతలు బోగవల్లి శ్రీధర్, పట్నాయక్, కర్రి నాగ లక్ష్మి, మాదల రమేశ్, వీర బాబు తదితరులు పాల్గొన్నారు.