Homeఆంధ్రప్రదేశ్‌జగన్‌ను మెచ్చుకున్న సోము

జగన్‌ను మెచ్చుకున్న సోము

Somu Veerraju CM Jagan
అదేంటి.. అపోజిషన్‌ పార్టీ అధికార పార్టీని ప్రశంసించింది. ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ప్రభుత్వాన్ని పొగడడం ఇప్పుడు సంచలనమైంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. దేశంలోని అన్ని జిల్లాల్లో వైద్య కాలేజీలను ఏర్పాటు చేయాలనే మోడీ సర్కార్ లక్ష్యాన్ని నిర్దేశించారని, దానికి అనుగుణంగా జగన్ వాటిని నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో వైద్య కళాశాల నిర్మాణానికి కేంద్రం రూ.50 కోట్లను మంజూరు చేస్తోందని గుర్తు చేశారు.

Also Read: బాబుపై బాలయ్య అలక..: అందుకేనా..?

వైద్య కళాశాలను నిర్మించడానికి నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రభుత్వం 50 ఎకరాలను కేటాయించింది. దీనిపై కొద్దిరోజుల కిందటే ఉత్తర్వులను జారీ చేసింది. దీని పట్ల రైతుల్లో వ్యతిరేకత ఎదురవుతోందని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ ప్రదేశంలో బోధనాసుపత్రిని నిర్మించడం వల్ల వ్యవసాయ పరిశోధనలకు కష్టతరమౌతుందని చెప్పారు. కొత్త వంగడాల సృష్టి, పరిశోధనలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే.. వ్యవసాయ పరిశోధనా స్థలంలో బోధనాసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం భావించడమే ఈ వ్యతిరేకతకు కారణమట. ఇప్పుడు కేటాయించిన స్థలంలో బోధనాసుపత్రిని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము రైతాంగం పక్షాన నిలుస్తున్నామని, వారి డిమాండ్‌ను బలపరుస్తున్నామని అన్నారు.

Also Read: వారి ఆరోపణల్లో పస లేదట..!

నంద్యాల, పట్టణ పరిసరాల్లోనే పలు ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉన్నాయని, ఆ భూములను బోధనాసుపత్రి నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కావాల్సినంత ఖాళీ స్థలం ఉండటం వల్ల భవిష్యత్తులో ఆ బోధనాసుపత్రి విస్తరణకు కూడా అవకాశం ఉంటుందని సూచించారు. అంతేకానీ ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యవసాయ కేంద్రానికి చెందిన స్థలంలో.. బోధనాసుపత్రిని నిర్మించడం వల్ల పరిశోధనలు కుంటు పడే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కేంద్రాన్ని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని అన్నారు. మరో ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. మరి జగన్‌ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version